SNP
పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయని అల్లాడుతున్న వారికి గుడ్‌న్యూస్.. వీలైనంత త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తగ్గిపోనున్నాయి. అందుకు ముఖేష్ అంబానీ చేసుకున్న ఒక ఒప్పందమే కారణం. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..
పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయని అల్లాడుతున్న వారికి గుడ్‌న్యూస్.. వీలైనంత త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తగ్గిపోనున్నాయి. అందుకు ముఖేష్ అంబానీ చేసుకున్న ఒక ఒప్పందమే కారణం. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పెరగడమే కానీ, తగ్గడం అనేదే తెలియకుండా పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్లాయి. గతంలో ఎన్నడూ పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీ మార్క్ దాటుతాయని ఎవరూ అనుకోలేదు. కానీ, కొన్ని రోజుల్లోనే రెక్కలు వచ్చినట్లు ఈ ఇంధన ధరలు పైపైకి దూసుకెళ్లాయి. నిత్యం వాహనాలు ఉపయోగించే ప్రజలు ఈ పెట్రోల్ ధరలను తట్టుకోలేక.. అల్లాడిపోతున్నారు. అలాంటి వారందరికీ ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఆయన చేసుకున్న ఒక కీలక ఒప్పందం త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను అతి తక్కువ ధరకే దేశప్రజలకు అందించనున్నారు.
ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే.. మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయనే విషయం తెలిసిందే. కానీ, అదేంటో.. అనేకసార్లు క్రూడ్ ఆయిల్ రేట్లు పడిపోయినా కూడా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కానీ, ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండదని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అందుకు కారణం.. ముఖేష్ అంబానీ వెనిజులా దేశంతో చేసుకున్న ఒప్పందమే. అదేంటంటే.. వెనిజులా దేశంలో సైతం ముడి చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఇన్నాళ్లు వెనిజులాపై నిషేధం ఉండటంతో ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఆ దేశంపై నిషేధం ఎత్తివేయడంతో.. ముడి చమురును దిగమతి చేసుకునేందుకు ముఖేష్ అంబానీ వెనిజులాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెనిజులా ఉంది. ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు ఇప్పటికే అంబానీ ఆర్డర్‌ను బుక్ చేసేశారు. దీంతో.. వెనిజులా నుంచి చౌకగా చమురు లభిస్తే.. తన తన బంకుల్లో ప్రస్తుతం దొరుకుతున్న ధర కంటే చాలా తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అందించనున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో లభిస్తున్న ముడి చమురు ధర కంటే.. బ్యారెల్‌కు 8 నుంచి 10 డాలర్ల తక్కువ ధరకే వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకోవచ్చు. మరి ఈ లెక్కన జియోతో సంచలనం సృష్టించిన అంబానీ, తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అందించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BREAKING NOW: Mukesh Ambani’s Reliance hired President Trump’s close aide Brian Ballard as lobbyist. Paid Ballard et al $750,000. Reliance been importing crude from Venezuela worth more than $3.75billion despite sanctions. Brilliant report by @kjsingh001 https://t.co/8ffPnwtHB8
— Vinod K. Jose (@vinodjose) February 23, 2020