కేంద్రం శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

LPG Cylinder Price: నెల ప్రారంభంలో సామాన్యులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

LPG Cylinder Price: నెల ప్రారంభంలో సామాన్యులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

మన దేశంలో ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. దాంతో కొత్త నిర్ణయాలు, నియమ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అలానే నేడు అనగా సోమవారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఇక ఇప్పటికే కొత్త ఫైనాన్సియల్ ఇయర్ ప్రారంభమైన మొదటి రోజు అనగా ఏప్రిల్ 1న టోల్ ఛార్జీలు పెంపు అమల్లోకి వచ్చింది. ఇక సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయి. దానిలో భాగంగా ఏప్రిల్ 1 సోమవారం రోజున కూడా చమురు సంస్థలు గ్యాస్ ధరలపై నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈసారి మాత్రం సామాన్యులకు శుభవార్తే చెప్పాయి. గ్యాస్ ధరలను తగ్గించాయి. ఆ వివరాలు..

ఏప్రిల్ 1 సోమవారం నాడు గ్యాస్ సిలిండర్ ధరలు దిగొచ్చాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలు స్థిరంగా ఉండగా.. కమర్షియల్ సిలిండర్ ధరల్ని తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల దానికి బ్రేక్ వేస్తూ.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 30.50 తగ్గిస్తు నిర్ణయం ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1764.50కి చేరింది. అంతకుముందు ఇది రూ. 1795 గా ఉండేది.

ఇక ఈ కమర్షియల్ గ్యాస్ ధరలు కోల్‌కతాలో రూ. 1879, ముంబైలో రూ. 1717.50, చెన్నైలో రూ. 1930 కి చేరాయి. హైదరాబాద్‌లో కూడా ఈ ధర తగ్గినట్లు తెలుస్తోంది. అంతకుముందు నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 25 పెరిగి రూ. 2027 కు చేరగా.. ఇప్పుడు రూ. 30.50 తగ్గింది.

వాణిజ్య గ్యాస్ సిలిండర్ అంటే బయట హోటల్స్, రెస్టారెంట్లలో వంట కోసం వినియోగించేవి అన్నమాట. ఇక గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేదు. ఢిల్లీలో ప్రస్తుతం 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 803 గా ఉంది. హైదరాబాద్‌లో ఇది రూ. 855 గా ఉంది. ఇక ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ. 300 సబ్సిడీ ఉండగా.. వారికి వరుసగా రూ. 503, రూ. 555 కే గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉండటం విశేషం.

కేంద్ర ప్రభుత్వం రాఖీ పండుగ, ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రెండుసార్లు 300 రూపాయల మేర తగ్గించింది. దాంతో సామాన్యులకు భారీ ఊరట లభించింది అని చెప్పవచ్చు. ఇక గతంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1100 కుపైనే ఉండగా.. ఇప్పుడు అది రూ. 800 స్థాయికి దిగొచ్చింది. ఉజ్వల యోజన లబ్ధిదారులకు 500లకే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.

Show comments