nagidream
ఏసీల్లో చాలా మోడల్స్ ఉంటాయి. కానీ మీరు కొనుక్కునే ఏసీ మీద ఎంత కరెంట్ బిల్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మోడల్ ఏసీ కొనుక్కుంటే కరెంట్ బిల్లు చాలా అంటే చాలా తగ్గుతుంది. మరి ఆ మోడల్ ఏంటో ఓ లుక్కేయండి.
ఏసీల్లో చాలా మోడల్స్ ఉంటాయి. కానీ మీరు కొనుక్కునే ఏసీ మీద ఎంత కరెంట్ బిల్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మోడల్ ఏసీ కొనుక్కుంటే కరెంట్ బిల్లు చాలా అంటే చాలా తగ్గుతుంది. మరి ఆ మోడల్ ఏంటో ఓ లుక్కేయండి.
nagidream
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఏసీలు కొనే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అయితే ఎలాంటి ఏసీలు కొనాలి? ఎలాంటి ఏసీలు కొంటే తక్కువ కరెంట్ కాలుతుంది? ఏ స్టార్ రేటింగ్ ఏసీ కొనాలి? 3 స్టార్ ఆ? 5 స్టార్ ఆ? ఏది కొంటే మంచిది? 1 టన్, 1.5 టన్, 2 టన్ వీటిలో మన గదికి సరిపడా ఏసీని ఎలా ఎంచుకోవాలి అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అంత రేటు పెట్టి కొన్నందుకు ప్రయోజనం ఉండదు. పైగా కరెంట్ బిల్లు కూడా తడిసిమోపుడవుతుంది. అందుకే ఏసీలు కొనేముందు ఈ కింది వాటి గురించి బాగా తెలుసుకోవాలి.
3 స్టార్, 5 స్టార్.. 1 టన్, 1.5 టన్ ఇలా మీ ఇంటికి సరిపోయే ఏసీ ఏదో తెలుసుకున్నట్లైతే కనుక.. ఇప్పుడు మీరు కొనాలనుకున్న ఏసీలో ఈ ఫీచర్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా ఏసీలు ఇన్వర్టర్ తో వస్తున్నాయి. దీని వల్ల కొంత పవర్ బిల్ అయితే ఆదా అవుతుంది. అయితే దీని కన్నా కూడా ఇంకా పవర్ బిల్ తగ్గించుకునే ఏసీ మోడల్స్ ఉన్నాయి. వైఫై ఫీచర్ కలిగిన స్మార్ట్ ఏసీలు ఉంటాయి. ఈ ఫీచర్ ఉంటే ఏసీని మొబైల్ తో ఆపరేట్ చేయవచ్చు. అది కూడా మనమే ఒక కోడింగ్ లా కొన్ని ప్రీ ప్రోగ్రామ్స్ సెట్ చేసుకుని ఏసీ ఎలా రన్ అవ్వాలి అని నియంత్రించవచ్చు. ఉదాహరణకు రాత్రి మీరు గాఢంగా నిద్రపోతున్నారు. ఏసీ ఆన్ లో ఉంది. మధ్యలో చలి వేస్తుంది. నిద్ర పాడు చేసుకుని మరీ ఏసీ ఆఫ్ చేయాలి. బద్దకిస్తే అనవసరంగా చలిలో నిద్రపోవడం వల్ల కరెంట్ బిల్లు భారం. అలానే బయట ఏ చల్లగాలి వీయడమో, వర్షం పడడమో జరుగుతుంది. అది మీకు బాగా చలి పెడితేనే గానీ తెలియదు.
ఏ దుప్పటో కప్పుకుని నిద్రపోతే ఇక ఏసీ అనవసరంగా ఉదయం వరకూ రన్నింగ్ లో ఉన్నట్టే. దీని వల్ల కూడా కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. అందుకే స్మార్ట్ ఏసీ అనుకోండి. మీరు మొబైల్ లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని వర్షం పడినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏసీ ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. మీరు నిద్రలో ఉండగా పనిగట్టుకుని మేల్కొనే పని లేదు. దానికదే ఏసీ ఆఫ్ అయిపోతుంది. అలానే గది ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు చలి స్టార్ట్ అవుతుంది అన్న సమయంలో కూడా ఏసీ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయేలా సెట్ చేసుకోవచ్చు.
అలానే ఉక్కబోత స్టార్ట్ అవుతుంది అనగా అంటే గది ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏసీ ఆన్ అయ్యేలా ప్రోగ్రాం సెట్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో రూమ్ టెంపరేచర్, అలానే బయట వాతావరణాన్ని బట్టి ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. దీని వల్ల ఏసీ అనవసరంగా ఎక్కువ సేపు రన్నింగ్ లో ఉండదు. కరెంట్ బిల్లు చాలా ఆదా అవుతుంది. కాబట్టి మీరు ఏసీలు కొనే ముందు వైఫై కనెక్షన్ తో యాప్ ద్వారా కంట్రోల్ చేసుకునేలా స్మార్ట్ ఫీచర్ కలిగిన ఏసీలు ఉన్నాయేమో కనుక్కోండి. 35 వేల బడ్జెట్ లో శామ్‌సంగ్ కంపెనీ స్మార్ట్ ఏసీలను అందిస్తుంది. మరి ఈ కథనం మీకు నచ్చినట్లైతే షేర్ చేయండి. మీరు ఎలాంటి ఏసీ వాడుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఈ కింది ఏసీలన్నీ కరెంట్ ని ఆదా చేసే స్మార్ట్ ఏసీలే! ఓ లుక్కేయండి!