iDreamPost

ఎయిర్ కండిషనర్‌లో 3 స్టార్, 5 స్టార్‌లకి తేడా ఏంటి? ఏది కొనుక్కోవాలి?

సమ్మర్ లో ఇంత వేడిని తట్టుకోవాలంటే ఏసీ ఉండాల్సిందే. అయితే ఏసీల్లో 3 స్టార్ అని, 5 స్టార్ అని రకాలు ఉంటాయి. అసలు ఈ 3 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఏంటి? వీటి మధ్య తేడా ఏంటి? ఈ రెండిటిలో ఏది తీసుకుంటే మంచిది? అనే వివరాలు మీ కోసం. 

సమ్మర్ లో ఇంత వేడిని తట్టుకోవాలంటే ఏసీ ఉండాల్సిందే. అయితే ఏసీల్లో 3 స్టార్ అని, 5 స్టార్ అని రకాలు ఉంటాయి. అసలు ఈ 3 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఏంటి? వీటి మధ్య తేడా ఏంటి? ఈ రెండిటిలో ఏది తీసుకుంటే మంచిది? అనే వివరాలు మీ కోసం. 

ఎయిర్ కండిషనర్‌లో 3 స్టార్, 5 స్టార్‌లకి తేడా ఏంటి? ఏది కొనుక్కోవాలి?

ఈ వేసవి తాపాన్ని తట్టుకుని సుఖంగా నిద్రపోవాలంటే ఖచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. పెరిగే టెంపరేచర్ కి అసౌకర్యంగా ఉంటుంది. చెమటలు పట్టేసి డ్రెస్ పాడైపోతుంది. అదే ఏసీ ఉంటే సమ్మర్ సీజన్ నే వింటర్ సీజన్ లో ఉన్న అనుభూతిని పొందవచ్చు.  అయితే ఈ అనుభూతి కోసం ఏసీ కొనాల్సిందే. మరి ఎలాంటి ఏసీ కొనాలి? 3 స్టార్, 5 స్టార్ అంటున్నారు. ఈ స్టార్ మధ్య తేడా ఏంటి? ఏ ఏసీ కొనుక్కుంటే మంచిది? అసలు ఏసీల్లో స్టార్ రేటింగ్ అంటే ఏంటి?    

స్టార్ రేటింగ్ అంటే?

ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించిన ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి తెలిపేదాన్ని స్టార్ రేటింగ్ అంటారు. ఎన్ని ఎక్కువ స్టార్స్ ఉంటే అంత ఎక్కువ ఎనర్జీ ఎఫీషియంట్ అని అర్ధం. అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఇండియా.. 1 నుంచి 5 స్టార్ రేటింగ్ సిస్టంని రూపొందించింది. దీని వల్ల మామూలు సామాన్యులకు కూడా ఏ ఎలక్ట్రానిక్ వస్తువు ఎంత ఎఫీషియంట్ గా పని చేస్తుంది అనేది తెలుసుకోగలుగుతారు. ఈ స్టార్ రేటింగ్ అనేది.. రెండు పెరామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.  స్టార్ రేటింగ్ అనేది ఏసీ కూలింగ్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక గదిని చల్లబర్చడానికి ఎంత శక్తి ఖర్చు అవుతుందో తెలియజేసే కూలింగ్ కెపాసిటీని బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ లో (బీటీయూ) లెక్కిస్తారు.

అలానే ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్ (ఈఈఆర్) మీద ఆధారపడి ఉంటుంది. ఈఈఆర్ అంటే.. ఒక నిర్దిష్ట పవర్ తో కూలింగ్ అందించడాన్ని ఈఈఆర్ అని అంటారు. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు లేదా ఎయిర్ కండిషనర్ లో హయ్యెస్ట్ రేటింగ్ అంటే అది ఐదే. అలానే లోయస్ట్ రేటింగ్ అంటే 1. 5 స్టార్ ఎయిర్ కండిషనర్ గదిని అత్యంత సమర్థవంతంగా చల్లబరుస్తుంది. దీనర్ధం 3 స్టార్ ఏసీతో పోలిస్తే గదిని వేగంగా చల్లబర్చడానికి తక్కువ కరెంట్ ఖర్చుని వినియోగించుకుంటుంది. దీని వల్ల కరెంట్ బిల్ అనేది 3 స్టార్ ఏసీతో పోలిస్తే తక్కువ ఉంటుంది. అందుకే స్టోర్స్ లో కూడా 5 స్టార్ తీసుకోండి అని చెబుతారు. 3 స్టార్ ఏసీల్లో ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్ అనేది 2.9 నుంచి 3.09 రేంజ్ లో ఉంటుంది. అదే 5 స్టార్ ఏసీల్లో అయితే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్ అనేది 3.3 కన్నా ఎక్కువ ఉంటుంది. 

5 స్టార్ ఏసీల వల్ల కలిగే ప్రయోజనాలు:

3 స్టార్, 5 స్టార్ ఏసీల్లో కరెంట్ బిల్ విషయంలో తేడా గురించి తెలుసుకోవాలనుకుంటే.. ఉదాహరణకు 3 స్టార్ ఏసీ వల్ల నెల మొత్తంలో రూ. 580 కరెంట్ బిల్లు వచ్చిందనుకుంటే.. అదే 5  స్టార్ ఏసీ వల్ల రూ. 500 వస్తుంది. 5 స్టార్ 1.5 టన్ ఏసీ గంటకు 1.5 యూనిట్స్ ఎలక్ట్రిసిటీని తీసుకుంటే.. 3 స్టార్ 1.5 టన్ ఏసీ గంటకు 1.6 యూనిట్ల కరెంట్ ని తీసుకుంటుంది. 0.1 యూనిట్టే కదా తేడా అనుకుంటే దాని దగ్గరే చాలా తేడా వస్తుంది. అయితే 3 స్టార్ తో పోలిస్తే 5 స్టార్ ఏసీలు ధర ఎక్కువ ఉంటుంది.

అన్ని సీజన్స్ లో ఏసీ వేసుకునేటట్టు అయితే బడ్జెట్ ఎక్కువైనా గానీ 5 స్టార్ ఏసీ తీసుకోవడం బెటర్. దీని వల్ల లాంగ్ రన్ లో కరెంట్ బిల్లు అనేది తగ్గుతుంది. లేదు వేసవి సీజన్ లో మాత్రమే వేసుకుంటాం అనుకుంటే కనుక 3 స్టార్ ఏసీ తీసుకోవడం బెటర్. రేటు తగ్గుతుంది. లాంగ్ రన్ యూసేజ్ ఉండదు కాబట్టి కరెంట్ బిల్లు బెడద కూడా ఉండదు. మరి మీరు ఏసీ వాడుతున్నారా? 3 స్టార్ ది వాడుతున్నారా? 5 స్టార్ ఏసీ వాడుతున్నారా? మీకు ఏది బెటర్ అని అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి