iDreamPost

నైటంతా AC వాడితే ఎంత కరెంట్ బిల్లు వస్తుంది? ఖర్చుని ఇలా తగ్గించుకోండి

ఏసీలు చాలా మందికి ఉండచ్చు. కానీ చాలా కొద్ది ఇళ్లలో మాత్రమే ఏసీ రాత్రంతా ఆన్ లో ఉంటుంది. కారణం కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందన్న భయం. అసలు ఏసీ ఎన్ని గంటలు నడిస్తే ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది?

ఏసీలు చాలా మందికి ఉండచ్చు. కానీ చాలా కొద్ది ఇళ్లలో మాత్రమే ఏసీ రాత్రంతా ఆన్ లో ఉంటుంది. కారణం కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందన్న భయం. అసలు ఏసీ ఎన్ని గంటలు నడిస్తే ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది?

నైటంతా AC వాడితే ఎంత కరెంట్ బిల్లు వస్తుంది? ఖర్చుని ఇలా తగ్గించుకోండి

ఏసీ ఎంతమంది ఇళ్లలో ఉందనేది ముఖ్యం కాదు. ఎంతమంది నైటంతా వేసుకుని ఉంచుకుంటున్నారనేదే ముఖ్యం. ఇప్పుడు దాదాపు చాలా మంది ఇళ్లలో ఏసీ ఉన్నా కానీ నైటంతా వేసుకోరు. పగలు నిద్రపోరు కాబట్టి వేసుకునే పని ఉండదు. రాత్రి ఏసీ వేసుకున్నా కూడా చాలా మంది మిడిల్ క్లాస్ వారి పరిస్థితి జాగారమే. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందేమో అన్న భయం. అయితే అసలు ఏసీ వాడితే కరెంట్ బిల్ ఎంత వస్తుంది? 8 గంటలు నిరంతరాయంగా ఏసీ నడిస్తే ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది? ఎలాంటి ఏసీలు కొనుక్కుంటే కరెంట్ బిల్ సేవ్ అవుతుంది వంటి విషయాలు మీ కోసం.   

ఇప్పుడు అన్నీ 1 టన్ను, 1.5, 2 టన్ ఏసీలే ఎక్కువగా వస్తున్నాయి. కొనేవారు కూడా ఇవే కొంటున్నారు. గది సైజుని బట్టి టన్ లెక్క మారుతుంది. రూమ్ కొంచెం చిన్నగా ఉన్నవారు 1 టన్, 1.5 టన్ ఏసీ కొనుక్కుంటారు. పెద్దగా ఉంటే 2 టన్ ఏసీ కొనుక్కుంటారు. ఉదాహరణకు మీరు 2 టన్ ఏసీ కొనుక్కున్నారనుకుందాం. ఆ ఏసీ కనుక 2 కిలోవాట్ దైతే కనుక మీరు నెలలో 30 రోజుల పాటు డైలీ 8 గంటల పాటు ఆన్ లో ఉంచితే ఎన్ని యూనిట్ల కరెంట్ కాలుతుందో తెలుసా?

2X8 (2 కిలోవాట్ X గంటలు) అంటే మొత్తం ఒకరోజులో 16 కిలోవాట్ అవర్ కరెంట్ అనేది ఖర్చు అవుతుంది.  ఒక కిలోవాట్ అవర్ అంటే ఒక యూనిట్ అని అర్థం. అంటే నెల మొత్తం మీద 480 యూనిట్ల కరెంట్ ఖర్చు అయినట్టు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డు లెక్కల ప్రకారం యూనిట్ ధర యావరేజ్ గా 7 రూపాయలు పడుతుంది. అంటే మీకు కరెంట్ బిల్ రూ. 3,360 వస్తుంది. 2 టన్ ఏసీని రోజులో 8 గంటల సేపు ఆన్ లో ఉంచితే డైలీ 16 యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది. అంటే డైలీ మీకు వంద రూపాయల పైనే ఖర్చు అవుతుంది. అదే 1.5 టన్ అయితే 1.5X8X30 అంటే 360 యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది. యావరేజ్ యూనిట్ ధర 6 రూపాయలు అనుకున్నా రూ. 2,160 కరెంట్ బిల్ అనేది జనరేట్ అవుతుంది.

How much will be the bill if AC is used all night

అదే మీరు వాడే ఏసీ 1 టన్ అయితే కనుక డైలీ 8 యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది. 30 రోజులకు 240 యూనిట్లు అంటే యూనిట్ కి యావరేజ్ గా 5 రూపాయల చొప్పున 240 యూనిట్లకు 1360 రూపాయల కరెంట్ బిల్ వస్తుంది. అయితే ఈ టన్ అనేది గది పరిమాణం బట్టి ఉంటుంది. మీ గది పెద్దదైతే కనుక 1 టన్ ఏసీ సరిపోదు. పైగా గది మొత్తం కూల్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలానే ఈ యూనిట్ ఖర్చు అనేది ఏసీ రేటింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ అని, 3 స్టార్ రేటింగ్ అని ఏసీల్లో తేడాలు ఉంటాయి. ఏసీలు కొనే ముందు ఏసీలు అమ్మేవారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి. ఆ ఏసీ ఎన్ని యూనిట్లు కాల్చుతుంది? దాని కెపాసిటీ ఎంత? వంటి వివరాలు అడగాలి. తక్కువ కరెంట్ ఖర్చయ్యే ఏసీలు కొంచెం ధర ఎక్కువే ఉంటాయి.

లేటెస్ట్ టెక్నాలజీ ఎయిర్ కండిషనర్లు ధర ఎక్కువ ఉన్నా తక్కువ కరెంట్ తీసుకుని రన్ అవుతాయి. ఏసీకి సంబంధించిన మాన్యువల్ లో కూడా ఏసీకి సంబంధించిన వివరాలు ఉంటాయి. అది ఎన్ని యూనిట్ల కరెంట్ ని ఖర్చు చేస్తుందో తెలుసుకోవచ్చు. మరి ఈ లెక్కలను బట్టి మీరు మీ ఏసీ వాడకాన్ని నియంత్రించుకోవచ్చు. మీకు బిల్ ఎంత రావాలి అనుకుంటున్నారో అనే దాన్ని బట్టి ఎన్ని గంటలు వాడుకోవచ్చు అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. అయితే ఇది ఉదాహరణకు చెప్పిన లెక్క మాత్రమే. వాస్తవ లెక్క వేరేగా ఉంటుందని గమనించగలరు. ఈ కథనం మీకు మాత్రమే కాకుండా మిగతా వారికి కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏసీ వాడుతున్నట్లైతే కనుక ఏ ఏసీ వాడుతున్నారు? మీరు డైలీ ఎన్ని గంటలు వాడతారు? నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి