మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

Liger X Made World's First Auto-Balancing Scooter: ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తయారు చేసింది లైగర్ మొబిలిటీ కంపెనీ. ఇది డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునేవారికి బాగా సూట్ అవుతుంది.

Liger X Made World's First Auto-Balancing Scooter: ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తయారు చేసింది లైగర్ మొబిలిటీ కంపెనీ. ఇది డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునేవారికి బాగా సూట్ అవుతుంది.

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి చాలా కష్టంతో కూడుకున్న పని. డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో వెనుక ఎవరో ఒకరు ఉండాలి. లేదంటే కింద పడిపోతారు. కొన్నిసార్లు వెనుక ఎవరు ఉన్నా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోలేరు. అయితే ఈ ఆటో బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో డ్రైవింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే చాలా సులువుగా నేర్చుకోవచ్చు. కాళ్ళు కింద పెట్టకున్నా ఇది దానికదే బ్యాలెన్స్ అవుతుంది. కింద పడిపోవడం అనేది ఉండదు. వర్షాకాలంలో కాళ్ళు బురదలో పెట్టడం అంటే చిరాకు ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయో మనకి తెలిసిందే. అటువంటి సమయంలో నెమ్మదిగా వెళ్తున్నా, ఆగి ఉన్నా కాళ్ళు కింద పెట్టే పని ఉండదు.

అంతేనా రివర్స్ చేయాలంటే ఒక కాలు కింద పెట్టక్కర్లేదు. రివర్స్ మోడ్ లో కూడా ఇది బ్యాలెన్స్ చేసుకుంటుంది. కారులా అన్న మాట. కారు నడిపినట్టే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటో-బ్యాలెన్సింగ్ స్కూటర్. ముంబైకి చెందిన లైగర్ మొబిలిటీ అనే కంపెనీ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చింది. ఇందులో లైగర్ ఎక్స్, లైగర్ ఎక్స్+ అనే రెండు మోడల్స్ ని తీసుకొచ్చింది. లిక్విడ్ కూల్డ్ బ్యాటరీస్, సెల్ బ్యాలెన్సింగ్, థర్మల్ రన్ అవే ప్రొటెక్షన్ ఫీచర్స్ తో ఈ బండి వస్తుంది. ఇండియన్ కండిషన్స్ కి తగ్గట్టు తయారు చేశారు. రోబస్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టంని ప్రొవైడ్ చేశారు. దీని ధరను అయితే కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ అందుతున్న సమాచారం మేరకు 90 వేల రూపాయలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

లైగర్ ఎక్స్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:

  • గంటకు 65 కి.మీ. టాప్ స్పీడ్ 
  • ఆటో బ్యాలెన్సింగ్ (150 కిలోల వరకూ, ఇద్దరు రైడర్స్ కూర్చున్నా బండి బ్యాలెన్స్ చేసుకుంటుంది)
  • సింగిల్ ఛార్జ్ తో రేంజ్ 60 నుంచి 80 కి.మీ.   
  • ఎల్సీడీ డిస్ప్లే 
  • లెర్నర్ మోడ్ 
  • ఆటో బ్యాలెన్స్డ్ రివర్స్ మోడ్

లైగర్ ఎక్స్+ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:

  • గంటకు 80 కి.మీ. టాప్ స్పీడ్ 
  • ఆటో బ్యాలెన్సింగ్ (150 కిలోల వరకూ, ఇద్దరు రైడర్స్ కూర్చున్నా బండి బ్యాలెన్స్ చేసుకుంటుంది)
  • సింగిల్ ఛార్జ్ తో రేంజ్ 100 నుంచి 125 కి.మీ.   
  • టీఎఫ్టీ డిస్ప్లే 
  • లెర్నర్ మోడ్ 
  • ఆటో బ్యాలెన్స్డ్ రివర్స్ మోడ్

 

Show comments