iDreamPost
android-app
ios-app

పాకిస్తాన్ ఆస్తుల కంటే LIC ఆస్తులే ఎక్కువ! ఏకంగా అన్ని లక్షల కోట్లు!

  • Published May 30, 2024 | 9:21 PM Updated Updated May 30, 2024 | 9:21 PM

LIC Assets More Than Pakistan GDP: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మన దేశ ఆర్థిక వ్యవస్థను కాదు కదా కనీసం దేశంలో భాగమైన ఎల్ఐసీ సంస్థ యొక్క ఆస్తులను సైతం అందుకోలేకపోయింది. పాకిస్తాన్ ఆస్తుల కంటే కూడా ఎల్ఐసీ ఆస్తులు ఎక్కువగా ఉండడం విశేషం. పాకిస్తాన్ జీడీపీ ఎంతో తెలుసా? ఎల్ఐసీ ఆస్తులు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

LIC Assets More Than Pakistan GDP: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మన దేశ ఆర్థిక వ్యవస్థను కాదు కదా కనీసం దేశంలో భాగమైన ఎల్ఐసీ సంస్థ యొక్క ఆస్తులను సైతం అందుకోలేకపోయింది. పాకిస్తాన్ ఆస్తుల కంటే కూడా ఎల్ఐసీ ఆస్తులు ఎక్కువగా ఉండడం విశేషం. పాకిస్తాన్ జీడీపీ ఎంతో తెలుసా? ఎల్ఐసీ ఆస్తులు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

పాకిస్తాన్ ఆస్తుల కంటే LIC ఆస్తులే ఎక్కువ! ఏకంగా అన్ని లక్షల కోట్లు!

దేశీయ దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ పాకిస్తాన్ ని బీట్ చేసింది. ఎవరూ అందుకోలేని రికార్డుని సొంతం చేసుకుంది. భారతదేశానికి చెందిన ఒక సంస్థ ఆస్తుల విషయంలో పాకిస్తాన్ లాంటి దేశాలు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది. ఇటీవలే భారీ మొత్తాన్ని డివిడెండ్ గా కేంద్ర ప్రభుత్వానికి అందించి టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచింది ఎల్ఐసీ. తాజాగా మరో సంచలనానికి తెరలేపింది. ఆస్తుల నిర్వహణ విషయంలో ఎల్ఐసీ చరిత్ర సృష్టించింది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే కూడా అత్యథికంగా ఆస్తులను మేనేజ్ చేస్తూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎల్ఐసీ గ్రాస్ రిటర్న్  ప్రపంచంలో 5వ స్థానంలో నిలవగా.. ఆస్తుల విషయంలో 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

దేశంలో ఉన్న మ్యూచువల్ ఫండ్ పరిశ్రమతో కంటే కూడా ఎల్ఐసీ ఆస్తులు 1.1 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎల్ఐసీ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదిక ప్రకారం ఎల్ఐసీ ఆస్తుల విలువ 614.21 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరింది. అంటే 51.21 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. గత ఏడాదిలో 43.97 లక్షల కోట్లుగా ఉన్న ఎల్ఐసీ ఆస్తుల విలువ.. ఈ ఏడాది 16.48 శాతం పెరుగుదలతో 51.21 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ (ఐఎంఎఫ్) ప్రకారం.. 2023లో పాకిస్తాన్ జీడీపీ 338.24 బిలియన్ యూఎస్ డాలర్స్ అంటే 28.2 లక్షల కోట్లు. అంటే పాక్ మొత్తం ఆస్తులతో పోలిస్తే ఎల్ఐసీ సంస్థ ఆస్తులే ఎక్కువ.

శ్రీలంక, బంగ్లాదేశ్, సోమాలియా, మొజాంబిక్, దక్షిణ సూడాన్, బురుండి మొదలైన దేశాల కంటే కూడా ఎల్ఐసీ ఆస్తులు ఎక్కువగా ఉండడం విశేషం. గత ఆర్థిక ఏడాదిలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 280 బిలియన్ డాలర్లు ఉండగా.. బంగ్లాదేశ్ జీడీపీ 350 బిలియన్ డాలర్లు కలిగి ఉంది. ఇక శ్రీలంక జీడీపీ 81 బిలియన్ డాలర్లు కలిగి ఉంది. అయితే ఈ దేశాలేవీ కూడా భారతదేశాన్ని కాదు కదా కనీసం ఎల్ఐసీ సంస్థ ఆస్తులను కూడా టచ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇక మన దేశం వరకూ చూసుకుంటే దేశీయ బీమా రంగంలో ఇతర పోటీదారులతో పోలిస్తే.. రెండో అతిపెద్ద ప్రైవేట్ బీమా కంపెనీ అయిన ఎస్బీఐ లైఫ్ కంటే ఎల్ఐసీ 16.3 రెట్లు ఎక్కువ ఆస్తులను కలిగి ఉంది. ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 4 శాతం వాటా ఎల్ఐసీ వద్ద ఉందంటే ఆ సంస్థ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. స్వతంత్ర ప్రాతిపదికన ఎల్ఐసీ నిర్వహణలో ఉన్న ఆస్తులు మన దేశ జీడీపీలో 18 శాతానికి సమానం.