iDreamPost
android-app
ios-app

అద్భుతమైన ప్రయోజనాలతో.. LIC నుంచి మరో కొత్త పాలసీ!

ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రవేశ పెడుతుంటుంది. ఈ క్రమంలో మరో కొత్త పాలసీని ప్రకటించింది.

ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రవేశ పెడుతుంటుంది. ఈ క్రమంలో మరో కొత్త పాలసీని ప్రకటించింది.

అద్భుతమైన ప్రయోజనాలతో.. LIC నుంచి మరో కొత్త పాలసీ!

బీమా చేయించుకోవడం అనేది నేటి రోజుల్లో అత్యంత అవసరం. ఎప్పుడు ఏ ఆపద సంభవిస్తుందో తెలియదు. బీమా పాలసీ తీసుకున్నట్లైతే ఆపద కాలంలో బీమా సొమ్ము కుటుంబాలను ఆదుకుంటుంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో బీమా అందించే సంస్థలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలకంటే ప్రభుత్వ రంగానికి చెందిన ఇన్సూరెన్సు కంపెనీల్లో బీమా చేయించుకోవడం ద్వారా రిటర్న్స్ కు గ్యారంటీ ఉంటుంది. బీమా సంస్థల్లో అత్యంత ప్రజాదారణ పొందింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. వినూత్నమైన పాలసీలతో కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రవేశ పెడుతుంటుంది. ఈ క్రమంలో మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీతో అద్భుతమైన ప్రయోజనాలను అందించనుంది.

జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ తన పాలసీదారుల కోసం మరో కొత్త పాలసీని ప్రకటించింది. జీవన్‌ ధార 2 ప్లాన్‌ పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ జనవరి 22వ తేదీ నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఇది వ్యక్తిగత, సేవింగ్స్‌, డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌. ఈ పాలసీ తీసుకోవాలనుకునే పాలసీదారుల కనీస వయసు 20 ఏళ్లు ఉండాలి. అదే విధంగా గరిష్ఠ వయసు 80, 70, 65 సంవత్సరాలుగా నిర్ణయించింది. ప్రారంభం నుంచి యాన్యుటీకి అనుమతిస్తారు. ఈ ప్లాన్‌ కింద 11 యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పాల‌సీదారులు రెగ్యుల‌ర్‌గా, సింగిల్ ప్రీమియం వారీగా యాన్యుటీ ఆప్ష‌న్లు ఎంచుకునే అవకాశం క‌ల్పించింది.

ఈ మేరకు ఎల్‌ఐసీ చైర్మన్‌ సిద్ధార్థ మొహంతి దీన్ని ఆవిష్కరించారు. డిఫర్‌మెంట్‌ సమయంలో జీవిత బీమా కవరేజీ కూడా కల్పిస్తారు. కాగా రెగ్యులర్‌ ప్రీమియం తీసుకుంటే కాలపరిమితి 5-15 సంవత్సరాలుగా ఉంటుంది. సింగిల్‌ ప్రీమియం తీసుకుంటే 1-15 సంవత్సరాలుగ కాల వ్యవధి ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వారికి లోన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని మొహంతి తెలిపారు. మరి ఎల్ఐసీ తీసుకొచ్చిన ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.