nagidream
అబ్బే హైదరాబాద్ లో స్థలం కొనలేమండి. గజం లక్ష, రెండు లక్షలు చెప్తున్నారు అని అనుకుంటున్నారా? అయితే గజం ముప్పై వేలకు కూడా దొరికే ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందవచ్చు.
అబ్బే హైదరాబాద్ లో స్థలం కొనలేమండి. గజం లక్ష, రెండు లక్షలు చెప్తున్నారు అని అనుకుంటున్నారా? అయితే గజం ముప్పై వేలకు కూడా దొరికే ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందవచ్చు.
nagidream
హైదరాబాద్ లో స్థలం కొనాలంటే మామూలు విషయం కాదు. గొప్పోళ్ళు మాత్రమే కొనగలరు. అయితే తక్కువ రేటుకి స్థలం దొరుకుతున్నప్పుడు కొనేస్తే కొన్నేళ్ళకి మామూలోళ్లు కూడా గొప్పోళ్ళు అయిపోతారు. అవును ఇదే హైదరాబాద్ లో గజం లక్ష, రెండు లక్షలు ఉన్న స్థలాలు మాత్రమే కాదు.. 30 వేలకు దొరికే ఏరియాలు కూడా ఉన్నాయి. కూకట్ పల్లి, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతి నగర్, మియాపూర్, అమీన్ పుర, గాజుల రామారం, ఇస్నాపూర్ ఏరియాలు నార్త్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
ముందుగా కూకట్ పల్లిలో చూసుకుంటే చదరపు అడుగు స్థలం 11,350/- రూపాయలుగా ఉంది. బాచుపల్లిలో 6,600/-, మల్లంపేటలో 6,650/-, ప్రగతి నగర్ లో 8,500/-, మియాపూర్ లో 7,450/-, అమీన్ పుర లో 5,950/-, గాజుల రామారంలో 6,950/-, ఇస్నాపూర్ లో 3,000/- రూపాయలుగా ఉంది. బాచుపల్లిలో చదరపు అడుగు స్థలం 2014లో 600 రూపాయలు ఉండేది. పదేళ్లలో 6,600/- అయ్యింది. పదింతలు పెరిగింది. మియాపూర్ లో 2016లో చదరపు అడుగు 700 ఉండేది. 9 ఏళ్లలో 7,450 రూపాయలకు పెరిగింది. ఇది కూడా పదింతలు పెరిగింది. 2015లో అమీన్ పురలో చదరపు అడుగు స్థలం రేటు 550 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు 5,950 రూపాయలు పెరిగింది. 2014లో మల్లంపేటలో చదరపు అడుగు స్థలం రేటు 600 రూపాయలు ఉంటే అదిప్పుడు 6,650కి పెరిగింది.
కూకట్ పల్లిలో పదేళ్ల క్రితం అంటే 2014లో చదరపు అడుగు 1500 రూపాయలు ఉండేది. ఇప్పుడు 11,350 రూపాయలు అయ్యింది. అంటే గజం లక్ష పైనే పలుకుతుంది. గాజుల రామారంలో ఇప్పుడు చదరపు అడుగు 6,950 రూపాయలు ఉంటే.. 2015లో 1450/- ఉండేది. ప్రగతి నగర్ లో కూడా ఇంతే. ఒకప్పుడు చాలా తక్కువ రేట్లు ఉండేవి. ఇప్పుడు 8,500/- అయ్యింది. ఇస్నాపూర్ లో 2014 టైంలో చదరపు అడుగు 850/- ఉండేది. ఇప్పుడు 3 వేలకు పెరిగింది. నార్త్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగున్నా ఏరియాల్లో తక్కువ ధరకి స్థలాలు దొరికే ప్రాంతం ఏదైనా ఉందంటే అది ప్రస్తుతానికి ఇస్నాపూర్ మాత్రమే. కొన్ని రోజులు గడిస్తే ఇస్నాపూర్ కూడా కూకట్ పల్లిలా రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి కొనాలనుకుంటే తక్కువ రేటు ఉన్నప్పుడే కొనుక్కుంటే మంచిది.