లింగంపల్లికి అతి దగ్గరలో 35 లక్షలకే 100 గజాల స్థలం.. ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదు

Kollur Land Rates: హైదరాబాద్ లో మంచి ఏరియాలో తక్కువ బడ్జెట్ లో పెట్టుబడి పెట్టాలి.. ఫ్యూచర్ లో రెట్టింపు లాభాలు పొందాలి అని అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. సిటీలో మంచి లొకేషన్ లో తక్కువ రేటుకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి.

Kollur Land Rates: హైదరాబాద్ లో మంచి ఏరియాలో తక్కువ బడ్జెట్ లో పెట్టుబడి పెట్టాలి.. ఫ్యూచర్ లో రెట్టింపు లాభాలు పొందాలి అని అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. సిటీలో మంచి లొకేషన్ లో తక్కువ రేటుకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి.

మియాపూర్, కూకట్ పల్లి వంటి ఏరియాల్లో 100 గజాల స్థలం కొనాలంటే 75 లక్షల నుంచి కోటి 30 లక్షల దాకా అవుతుంది. ఇక హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు చెప్పుకోబీయే ఏరియాలో 35 లక్షలకే 100 గజాల స్థలం దొరుకుతుంది. 70 లక్షలు పెట్టుబడి పెడితే 200 గజాల స్థలం వస్తుంది. అలా అని ఈ ఏరియా ఏమీ సిటీకి 50, 100 కిలోమీటర్ల దూరంలో లేదు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ వంటి ఏరియాలకు దగ్గరలోనే ఉంది. లింగంపల్లి నుంచి అయితే కేవలం 12 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఏరియాలో పెట్టుబడి పెడితే కనుక ఫ్యూచర్ లో మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

కొల్లూరు ఐటీ హబ్స్ గా ఉన్న హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలకు దగ్గరలో ఉంది. అవుటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. సిటీలోని మిగతా ప్రాంతాలకు ఈజీగా ట్రావెల్ చేయవచ్చు. ఈ కనెక్టివిటీ కారణంగా నివాసం ఉండాలనుకునేవారికి, వ్యాపారవేత్తలకు కొల్లూరు అనువైన ప్రాంతంగా ఉంది. పొటెన్షియల్ గ్రోత్ హబ్ గా ఉంది. ఈ కారణంగా ఐటీ ప్రొఫెషనల్స్ కొల్లూరులో నివాసం ఉండేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఈ ఏరియా బెటర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను ఆర్జించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న స్థలాల ధరలతో పోలిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్న కొల్లూరులో ధరలు బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వారికి అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందాలనుకునేవారికి కొల్లూరు అనువైన ప్రదేశంగా ఉంది.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా వేగవంతమైన అభివృద్ధికి కొల్లూరు సాక్ష్యంగా ఉంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, హెల్త్ కేర్ సదుపాయాలు, షాపింగ్ సెంటర్లు వంటివి ఈ ఏరియాలో ఉన్న కారణంగా ఇక్కడ నివసించేందుకు అనువుగా ఉంది. ఈ ఏరియాలో పెట్టిన డెవలప్మెంట్స్ రాబోయే సంవత్సరాల్లో పూర్తి కానున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డెవలప్ అయితే ఇక్కడ ప్రాపర్టీలకి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు స్థలాల ధరలు పెరుగుతాయి. కాబట్టి పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఈ ఏరియాలో ప్రస్తుతం చదరపు అడుగు స్థలం రూ. 3850గా ఉంది. అంతకు ముందు చదరపు అడుగు స్థలం రూ. 4 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు కొంచెం తగ్గాయి. యావరేజ్ గా చదరపు అడుగు మీద రూ. 150 తగ్గాయి. అంటే గజం మీద రూ. 1350 తగ్గింది. గజం స్థలం యావరేజ్ గా రూ. 34,650గా ఉంది. 150 గజాల స్థలం కొనాలనుకుంటే కనుక 50 లక్షలు దాకా అవుతుంది. 35 లక్షలు పెట్టుకుంటే 100 గజాల స్థలం వస్తుంది. ఈ పెట్టుబడి కొన్నాళ్ళకు డబుల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. చదరపు అడుగు స్థలం ధర రూ. 10 వేలు అవుతుందని అంటున్నారు. 

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.

Show comments