nagidream
Land Rates In Indresham, Hyderabad: హైదరాబాద్ లో స్థలం కొనాలని, పెట్టుబడి పెట్టి ఫ్యూచర్ లో లాభాలు పొందాలని అనుకునేవారికి ఇదే సరైన అవకాశం. ఈ ఏరియాలో బడ్జెట్ లో ఇండ్ల స్థలాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్ లో మంచి లాభాలను పొందవచ్చు.
Land Rates In Indresham, Hyderabad: హైదరాబాద్ లో స్థలం కొనాలని, పెట్టుబడి పెట్టి ఫ్యూచర్ లో లాభాలు పొందాలని అనుకునేవారికి ఇదే సరైన అవకాశం. ఈ ఏరియాలో బడ్జెట్ లో ఇండ్ల స్థలాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్ లో మంచి లాభాలను పొందవచ్చు.
nagidream
హైదరాబాద్ లో స్థలం కొనాలనుకుంటున్నారా? స్థలం మీద పెట్టుబడి పెట్టి మంచి లాభాలు పొందాలని అనుకుంటున్నారా? అయితే మీకు స్థలాల ధరలు ఎక్కడ తక్కువగా ఉన్నాయో అనే విషయం తెలియాలి. పటాన్ చెరువు, మియాపూర్, మాదాపూర్ వంటి ఏరియాలకు దగ్గరలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో చాలా తక్కువ ధరకే 2 బీహెచ్కే ఇండ్ల స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మామూలుగా హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా స్థలాలు కొనాలంటే చదరపు అడుగు ధర కనీసం రూ. 8 వేల నుంచి ఉంది. అంటే వెయ్యి చదరపు అడుగుల స్థలం కొనాలంటే రూ. 80 లక్షలు అవుతుంది. అదే ఈ ఏరియాలో అయితే కేవలం 28 లక్షలకే మీకు వెయ్యి చదరపు అడుగుల స్థలం వస్తుంది. మియాపూర్ కి 20 కి.మీ., గచ్చిబౌలికి 32 కి.మీ., మాదాపూర్ కి 25 కి.మీ. దూరంలో ఉంది. పటాన్ చెరువు, కిష్టారెడ్డిపేట్ వంటి ఏరియాలకు 10 కి.మీ. లోపు దూరంలో ఉంది.
ఆ ఏరియా పేరు ఇంద్రేశం. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, బ్యాంకులు, మార్కెట్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్ వంటి వాటికి ఇంద్రేశం మంచి కనెక్టివిటీ కలిగిన ప్రైమ్ లొకేషన్ గా ఉంది. సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మున్సిపల్ వాటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు ప్రశాంతంగా కాలుష్యం లేకుండా జీవించేలా ఇక్కడ ఈ ప్రాంతం పచ్చని ప్రదేశాలు, నిర్మలమైన పరిసరాలను కలిగి ఉంది. ఇంద్రేశం అనేది హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయతగ్గ ఏరియా అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ప్రాపర్టీ గ్రోత్, అభివృద్ధికి సంభావ్యత కలిగి ఉంది కాబట్టి ఈ ఏరియా పెట్టుబడులకు అనువైనదని చెబుతున్నారు.
ప్రస్తుతం ఇంద్రేశంలో చదరపు అడుగు స్థలం యావరేజ్ గా రూ. 2,800గా ఉంది. అంటే గజం రూ. 25,200గా ఉంది. 2 బీహెచ్కే సరిపడా వెయ్యి చదరపు అడుగుల స్థలం కొనాలంటే రూ. 28 లక్షలు అవుతుంది. ఒకవేళ 150 గజాల స్థలం కొనాలంటే రూ. 38 లక్షలు అవుతుంది. ఇప్పుడు కనుక ఇక్కడ స్థలం కొంటే ఫ్యూచర్ లో మంచి లాభాలు పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. చదరపు అడుగు రూ. 5 వేలకు పెరిగినా గానీ లక్షల్లో లాభాలు వస్తాయని చెబుతున్నారు. పటాన్ చెరువు, మియాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాలకు దగ్గరగా ఉండడం వల్ల కలిసొచ్చే అంశం. 40 నిమిషాల నుంచి 50 నిమిషాల ప్రయాణం కాబట్టి ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యూచర్ లో ఇంద్రేశం ఏరియా మరింత డెవలప్ అయితే ఇక్కడ నివాస స్థలాలపై డిమాండ్ పెరుగుతుంది. దీంతో ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.