మీ డబ్బు రెట్టింపు కావాలా? ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టారంటే భారీ లాభాలే!

Investment: డబ్బు పొదుపు చేయాలనుకునేవారికి ఒక అద్భుతమైన పథకం ఉంది. ఇందులో రెట్టింపు లాభాలు పొందవచ్చు.

Investment: డబ్బు పొదుపు చేయాలనుకునేవారికి ఒక అద్భుతమైన పథకం ఉంది. ఇందులో రెట్టింపు లాభాలు పొందవచ్చు.

మధ్యతరగతి ప్రజలు డబ్బులు మిగుల్చుకోవడానికి అనేక రకాల పొదుపు మార్గాలని వెతుకుతూ ఉంటారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం చాలా రకాల సేవింగ్స్ స్కీమ్స్ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని వర్గాల వారి కోసం మంచి మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, ఉద్యోగుల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజెన్లకు సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, రిటైర్మెంట్ ఫండ్స్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇలా చాలా రకాల మంచి స్కీమ్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటిని మించిన స్కీమ్ ఒకటి ఉంది. ఈ స్కీమ్ లో చేరాలంటే మీకు కచ్చితంగా కొంచెం ఓపిక ఉండాలి. అలా ఓపికగా ఉంటే మీరు పెట్టుబడి పెట్టే డబ్బుపై రెట్టింపు లాభం పొందవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి? అందులో ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం వస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇదొక లాంగ్ టర్మ్‌ స్కీమ్. దీని పేరు కిసాన్ వికాస్ పత్ర. దీనిలో అద్భుతమైన రిటర్న్స్ ఉంటాయి. పైగా ఇందులో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. గతంలో రైతులకి మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్కీమ్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంటే ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో మినిమం రూ. 1000 డిపాజిట్‌తో చేరాల్సి ఉంటుంది. మాక్సిమం ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో ఎలాంటి లిమిట్ లేదు. ఇంకా సింగిల్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. మీ పిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. కానీ వారికి పది సంవత్సరాల వయసు దాటాలి. ఈ స్కీమ్ లో మాక్సిమం ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 7.50 % ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఓసారి ఈ స్కీమ్ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. వడ్డీ రేటు పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా ఫిక్స్డ్ గా కూడా ఉండొచ్చు.

ఇక ఈ స్కీమ్ లో మీరు 115 నెలలు అంటే 9 ఏళ్ల 7 నెలల పాటు మనీ ఇన్వెస్ట్ చేశారంటే అది డబుల్ అవుతుంది. అంటే రూ. లక్ష పెట్టుబడి పెడితే అది రూ. 2 లక్షలవుతుంది. రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 10 లక్షలుగా మారుతుంది. రూ. 20 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 40 లక్షలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకం కాబట్టి అసలు ఎలాంటి రిస్క్‌ ఉండదు. తక్కువ డిపాజిట్లతో కూడా ఈ స్కీమ్ లో చేరొచ్చు.అయితే టాక్స్ బెనిఫిట్స్ ఈ స్కీంలో లేవు. అందుకే మెచ్యూరిటీ డబ్బు పై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్ చెల్లించినా కూడా మీరు మంచి లాభాలే పొందుతారు. ఇక అకౌంట్ హోల్డర్ చనిపోవడం లేదా ఇతర ఏదైనా కారణాల వల్ల ఈ స్కీమ్ నుంచి తొలగిపోవచ్చు. అయితే అకౌంట్ ఓపెన్ చేసిన రెండేళ్ల 6 నెలల తర్వాత మాత్రమే ఇది కుదురుతుంది. ఇక ఈ స్కీమ్ కింద మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ లో చేరాలంటే అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి కేవైసీ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఒక ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ఇస్తే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.ఇదీ సంగతి. ఇక మీ డబ్బుని రెట్టింపు చేసే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments