P Venkatesh
వినియోగదారులకు సరికొత్త ఈ లూనా అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరకే మీరు ఈ లూనాను సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో రైతులకు, చిరు వ్యాపారులకు ఉపయోగకరంగా ఉండనున్నది.
వినియోగదారులకు సరికొత్త ఈ లూనా అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరకే మీరు ఈ లూనాను సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో రైతులకు, చిరు వ్యాపారులకు ఉపయోగకరంగా ఉండనున్నది.
P Venkatesh
ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పలు ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు ఈ స్కూటర్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వినియోగదారులు సైతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఓలా, ఏథర్ వంటి కంపెనీలు ఈవీ రంగంలో దూసుకెళ్తూ సరికొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు స్కూటర్లు, బైక్ లు అందుబాటులోకి రాగా తాజాగా ఈ -లూనా మార్కెట్లోకి లాంచ్ అయింది. మీరు అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ లూనాను దక్కించుకోవచ్చు.
ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్తే గ్రామాల్లో ఎక్కువగా దర్శనమిచ్చే వాహనాల్లో మోపెడ్ ఒకటి. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు, పలు పనుల నిమిత్తం రైతన్నలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేవారు. వీటి ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు ఇదే లూనా సరికొత్త రూపులో లాంచ్ అయింది. కైనటిక్ గ్రీన్ అనే సంస్థ ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్ ఛార్జ్ తో మీరు 110 కి.మీల దూరం వరకు ప్రయాణించొచ్చు. ఈ-లూనా ధర రూ.69,990 అని కైనటిక్ గ్రీన్ వెల్లడించింది. కాగా ఈ-లూనా గరిష్ఠవేగం 50 కిలోమీటర్లు. బ్యాటరీ ఛార్జింగ్ ఎంతుందో తెలిపే ఇండికేటర్ కూడా ఇందులో అమర్చారు. 2.0 కేడబ్ల్యుహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని ఈ-లూనాలో పొందుపర్చారు.
కైనెటిక్ గ్రీన్ ప్రవేశపెట్టిన ఈ-లూనాను కొనుగోలు చేయదలిచిన వారు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. జనవరి 26 నుంచే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కెనెటిక్ ఈ-లూనా ఐదు రంగులు-మల్బరీ రెడ్, ఓసియన్ బ్లూ, పెరల్ ఎల్లో, స్పార్క్ లింక్ గ్రీన్, నైట్ స్టార్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ-లూనాతోపాటు పోర్టబుల్ చార్జర్ ఉంటుంది. నాలుగు గంటల్లో పూర్తి స్థాయిలో చార్జింగ్ అవుతుంది. ఈ-లూనాలో కాంబి-బ్రేకింగ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, మూడు రైడింగ్ మోడ్‌లు, సైడ్-స్టాండ్ సెన్సార్ మొదలైన ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి.