నీటితో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్.. లీటర్‌కి 150 కి.మీ. రేంజ్!

Joy e bike Water Powered Bike With 150 Kms Range: పెట్రోల్ తో కాదు.. బ్యాటరీతో కాదు ఏకంగా నీటితో నడిచే స్కూటర్ ని తయారు చేసిందో కంపెనీ. లీటర్ వాటర్ తో 150 కి.మీ. నడిచేలా ఒక స్కూటీని రూపొందించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Joy e bike Water Powered Bike With 150 Kms Range: పెట్రోల్ తో కాదు.. బ్యాటరీతో కాదు ఏకంగా నీటితో నడిచే స్కూటర్ ని తయారు చేసిందో కంపెనీ. లీటర్ వాటర్ తో 150 కి.మీ. నడిచేలా ఒక స్కూటీని రూపొందించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ వాహనాలతో పోటీగా వీటి విక్రయాలు జరుగుతున్నాయి. పెట్రోల్ ధరలను భరించలేని వారి కోసం సీఎన్జీతో నడిచే వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బజాజ్ కంపెనీ కూడా సీఎన్జీ బైక్స్ ని ఇటీవలే లాంఛ్ చేసింది. పెట్రోల్ ధరలు పెరిగిపోవడం.. దానికి తోడు కాలుష్యం పెరిగిపోవడంతో చాలా మంది పెట్రోల్ కి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. సీఎన్జీ ద్విచక్ర వాహనాలు ఇంకా అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే విద్యుత్ వినియోగం ఎక్కువైనా కూడా కాలుష్యమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి పలు కంపెనీలు.

ఈ నేపథ్యంలో జాయ్ ఈ-బైక్ మాతృ సంస్థ అయినటువంటి ‘వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ’ కంపెనీ ఇటీవల హైడ్రోజన్ పవర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంఛ్ చేసింది. కంపెనీకి చెందిన ప్రతినిధి వాటర్ తో నడిచే స్కూటర్ ని పరిచయం చేశారు. లీటర్ నీటితో 150 కి.మీ. నడుస్తుందని ఆమె చెప్పారు. బ్యాటరీల్లో వాడే డిస్టిల్డ్ వాటర్ ని కొనుక్కుంటే 150 కి.మీ. ప్రయాణం చేయవచ్చునని అన్నారు. బూట్ స్పేస్ లోపల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉంది. డిస్టిల్డ్ వాటర్ ని నింపితే కనుక హైడ్రోజన్, ఆక్సిజన్ విచ్చిన్నం జరిగి బండి ముందుకు నడుస్తుందని అన్నారు. 30 గ్రాముల హైడ్రోజన్ తో 55 కి.మీ. ప్రయాణించవచ్చునని ఆమె అన్నారు. ఇక ఈ వెహికల్ టాప్ స్పీడ్ 25 కి.మీ. అని ఆమె తెలిపారు.

అయితే ఇది పిల్లలు నడపవచ్చునని.. దీనికి డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ అవసరం లేదని అన్నారు. ఇది సింగిల్ సీటుతో వస్తుంది. 12 అంగుళాల సైజు టైర్లు ఇచ్చారు. ఈ స్కూటీ ముందు ఒక చిన్న బుట్ట ఇచ్చారు. పిల్లలు ఏమైనా సరుకులు కొని తీసుకురావడానికి ఉపయోగపడేలా దీన్ని డిజైన్ చేశారు. ఇక డిస్టిల్డ్ వాటర్ ఒక లీటర్ ధర రూ. 20 ఉంటుంది. 20 రూపాయలతో 150 కి.మీ. ప్రయాణం అంటే మంచి విషయమే. కానీ టాప్ స్పీడ్ తక్కువ ఉండడం, ఒకరు మాత్రమే కూర్చునేలా డిజైన్ చేయడం వల్ల ఇది అందరికీ సూట్ అవ్వదు. అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. కానీ 70 వేలు పైనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొంతమంది వాడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Show comments