Jio Recharge plan: Jioలో చౌకైన ప్లాన్.. రూ.123 నెలంతా కాల్స్, డేటా! వారికి మాత్రమే!

Jioలో చౌకైన ప్లాన్.. రూ.123 నెలంతా కాల్స్, డేటా! వారికి మాత్రమే!

Jio Recharge plan: జియోలో చౌకైన ప్లాన్ అందుబాటులో ఉంది. కేవలం 123తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, డైలీ డేటా పొందొచ్చు. కానీ ఈ ప్లాన్ వారికోసం మాత్రమే.

Jio Recharge plan: జియోలో చౌకైన ప్లాన్ అందుబాటులో ఉంది. కేవలం 123తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, డైలీ డేటా పొందొచ్చు. కానీ ఈ ప్లాన్ వారికోసం మాత్రమే.

ప్రముఖ టెలికాం సంస్థలు టారీఫ్ ధరలను భారీగా పెంచినప్పటి నుంచి మొబైల్ యూజర్లు నెల నెల రీఛార్జ్ చేయించుకోవాలంటే వణికిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే.. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రీఛార్జ్ ధరలు కూడా పెరగడం మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు అయిపోయింది. ఫోన్ వాడాలంటే రీఛార్జ్ చేయించుకోక తప్పదు. అయితే ప్రముఖ టెలికాం సంస్థ జియోలో చౌకౌన ప్లాన్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 123తో రీఛార్జ్ చేస్తే చాలు 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, డైలీ డేటా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్ జియో యూజర్లందరికీ కాదండోయ్. కేవలం వారికి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఇంతకీ ఎవరి కోసమంటే?

టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రిలయన్స్ జియో ఇటీవల 4జీ ఫీచర్ ఫోన్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జియో భారత్ జె1 4జీ పేరిట కీప్యాడ్ ఫోన్ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ వినియోగించే వారికి జియో నుంచి రూ. 123 ప్లాన్ అందుబాటులో ఉంది. జియో భారత్ ఫోన్ ను కేవలం రూ. 123తో రీఛార్జ్ చేసుకుని అద్భుతమైన బెనిఫిట్స్ ను పొందొచ్చు. రూ. 123తో రీఛార్జ్ చేస్తే 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 14 జీబీ డేటా వస్తుంది. అంటే 28 రోజుల పాటు డైలీ 0.5జీబీ డేటాను యూజ్ చేసుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. 300 ఎస్ఎంఎస్ లను కూడా పొందొచ్చు. వీటితో పాటు జియో సావన్, జియో సినిమా, జియో టీవీ సబ్ స్క్రిప్షన్ ను పొందొచ్చు.

అదే విధంగా జియో భారత్ యూజర్ల కోసం మరో ప్లాన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 234తో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. డైలీ 0.5జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ పొందొచ్చు. ఏడాది ప్లాన్ కోసం చూసే జియో భారత్ యూజర్లకు సూపర్ ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 1234తో రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. డైలీ 0.5జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ వాడుకోవచ్చు.

Show comments