Jio రూ.175 ప్లాన్‌తో 12 OTT ఛానెళ్లను ఉచితంగా పొందే ఛాన్స్‌

Jio 175 Plan -12 OTT Subscription Free: జియో నుంచి సూపర్‌ ప్లాన్‌ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఏకంగా 12 ఓటీటీలు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

Jio 175 Plan -12 OTT Subscription Free: జియో నుంచి సూపర్‌ ప్లాన్‌ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఏకంగా 12 ఓటీటీలు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

టెలికాం రంగంలో సంచలనాలకు వేదికగా నిలిచింది జియో. ప్రారంభంలో తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్లను తీసుకువచ్చి.. అప్పటికే ఆ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌, వీఐ వంటి కంపెనీలకు భారీ షాక్‌ ఇచ్చింది. ఎంట్రీలో ఇలాంటి షాక్‌లు ఇచ్చిన జియో.. ఇక తాజాగా రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచుతూ.. వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను ఏకంగా 25 శాతం వరకు పెంచింది. ఇక ఇదే బాటలో మిగతా కంపెనీలు పయనించాయి. జియోతో పాటుగా ఎయిర్‌టెల్‌, వీఐలు రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్లాన్ల మీద గరిష్టంగా 100 రూపాయల వరకు పెరిగింది.

ఇక టెలికాం కంపెనీలు తీసుకున్న నిర్ణయం పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైగా వీటి కన్నా తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. ఇప్పటికే లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. ఈ క్రమంలో ఆయా టెలికాం కంపెనీలు.. వినియోగాదారులను కాపాడుకోవడం కోసం.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే జియో.. తన కస్టమర్లకు భారీ శుభవార్త చెప్పింది. రీఛార్జ్‌ ప్లాన్‌తో 12 ఓటీటీ ఛానళ్లను ఉచితంగా అందిస్తోంది. అది కూడా 200 రూపాయల కన్నా తక్కువ ధరకే. ఇంతకు అది ఏ ప్లాన్‌ అంటే..

వినియోగదారులను కాపాడుకోవడం కోసం జియో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా 175 రూపాయల ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. అయితే ఈప్లాన్‌లో అపరిమిత కాలింగ్‌ అవకాశం లేదు. కాకపోతే.. డెయిలీ లిమిట్‌ లేకుండా 10 జీబీ హైస్పీడ్‌ డేటాను అందిస్తుంది. దీన్ని ఇప్పటికే ఉన్న ప్లాన్లతో పాటు రీఛార్జ్‌ చేసుకోవాలి. కాకపోతే.. ఈ ప్లాన్‌ ద్వారా మీకు అదనంగా 12 ఓటీటీ ఛానల్స్‌ను ఫ్రీగా చూసేందుకు అవకాశం లభిస్తుంది.

రూ.175 ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకుంటే.. సోనీలివ్‌, జీ5, జీయో సినిమా ప్రీమియం, లయన్సగేట్‌ ప్లే, డిస్కవరీ+, సన్‌ నెక్ట్స్‌, కంచలంక, ప్లానెట్‌ మరాఠి, చౌపల్‌, డోకుబే, ఎపిక్‌ ఆన్‌తో పాటు మరికొన్ని ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇక ఈ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌లు డేటా ప్రయోజనాలు ఉన్న 28 రోజుల వరకే చెల్లుబాటు అవుతాయి. ఇలా విభిన్నమైన ప్లాన్‌లను అందించడం ద్వారా.. పోటీని తట్టుకుని.. కస్టమర్లను కాపాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అందుకే రూ. 175 ప్లాన్ అదనపు వినోద ప్రయోజనాలతో సరసమైన ఎంపికను అందించడం ద్వారా వినియోగదారులను తిరిగి ఆకర్షించడానికి సహాయపడుతుంది

Show comments