P Venkatesh
Jio Prepaid Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్. తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ ను ఇచ్చే ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తోంది.
Jio Prepaid Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్. తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ ను ఇచ్చే ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తోంది.
P Venkatesh
ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. పెరిగిన రీఛార్జ్ ధరలతో యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఓ వైపు నిత్యావసర ధరలు పెరగడం ఇప్పుడు రీఛార్జ్ ధరలు కూడా పెరగడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారయ్యింది. ఈ కారణంతో మొబైల్ యూజర్లు తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో జియో తమ కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరలో కాలింగ్, డేటాతో పాటు ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో జియో నుంచి 3 కొత్త ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. జియో తీసుకొచ్చిన కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా డిస్నీ హాట్ స్టార్, జియో సావన్ ప్రో సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు.
తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. రూ. 329 ప్రీపేయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్. ప్రతిరోజూ 1.5జీబీ డేటా పొందొచ్చు. 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. జియో సావన్ ప్రో, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.
జియో యూజర్ల కోసం మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 319తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్ పొందొచ్చు. డైలీ 1.5జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లను వాడుకోవచ్చు. ఈ ప్లాన్ క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీతో వస్తుంది. అంటే ఈ నెల సేమ్ డేట్ నుంచి వచ్చే నెల సేమ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది.(31-07-2024-31-08-2024). జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు.
ఈ ప్లాన్ రోజుకు 2 జీబీ డేటా చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్, జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు.