JIO New Plan- 15 OTT's Free Including Netflix: JIO సరికొత్త ప్లాన్.. ఒక్క రీఛార్జ్ తో 15 OTTలు ఫ్రీ స్ట్రీమింగ్!

JIO సరికొత్త ప్లాన్.. ఒక్క రీఛార్జ్ తో 15 OTTలు ఫ్రీ స్ట్రీమింగ్!

JIO New Plan- 15 OTT's Free Including Netflix: జియో సంస్థ తమ వినియోగదారులకు సూపర్ శుభవార్త చెప్పింది. అదేంటంటే.. మీరు ఒక్క రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 15 ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది. అందులో నెట్ ఫ్లిక్స్ కూడా ఉండటం విశేషం.

JIO New Plan- 15 OTT's Free Including Netflix: జియో సంస్థ తమ వినియోగదారులకు సూపర్ శుభవార్త చెప్పింది. అదేంటంటే.. మీరు ఒక్క రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 15 ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది. అందులో నెట్ ఫ్లిక్స్ కూడా ఉండటం విశేషం.

ఇప్పుడు అందరూ ఓటీటీలు సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. అయితే ఒకరు ఒకటికి మించి ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కో హిట్టు సినిమా ఒక్కో ఓటీటీలో విడుదల అవుతూ ఉంటుంది. మీకు నచ్చిన సినిమా చూడాలి అంటే మీ దగ్గర కచ్చితంగా ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ సబ్ స్క్రిప్షన్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు అంత ఇబ్బంది లేకుండా జియో తమ యూజర్ల కోసం ఒక బంపరాఫర్ తీసుకొచ్చింది. మీరు జియో ప్లాన్ తీసుకుంటే ఏకంగా మీకు జియో నెట్ మాత్రమే కాకుండా.. 15 ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ కూడా పూర్తి ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం మే 31 వరకు మాత్రమే అందిస్తున్నారు.

జియో సంస్థ ఇప్పుడు ఒక సూపర్ కూల్ గుడ్ న్యూస్ అందించింది. అదేంటంటే.. ఒక్క రీఛార్జ్ తో ఏకంగా 15 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది. అయితే ఇది మొబైల్ యూజర్స్ కోసం కాదు. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ వాడుతున్న వినియోగదారుల కోసం ఈ ప్రత్యేకమైన ప్లాన్ ని తీసుకొచ్చారు. దీనిని ఒక పోస్ట్ పెయిడ్ ప్లాన్ గా తీసుకొచ్చింది. మీరు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే.. మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా.. డిజిటల్ టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే ఇది కేవలం కొత్త యూజర్స్ కోసం మాత్రమే కాదండోయ్.. ఇప్పటికే మీకు జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సేవలను పొందుతూ ఉన్నట్లైతే మీరు ఈ ప్లాన్ కి అప్ గ్రేడ్ కావచ్చు.

ఈ ప్లాన్ పూర్తి వివరాలకు వస్తే.. ఈ ప్లాన్ తీసుకోవాలి అంటే మీరు 888 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ లో మీకు 30 ఎంబీపీఎస్ స్పీడ్ తో అన్ లిమిటెడ్ ఇంటర్నెక్ట్ కనెక్టివిటీ లభిస్తుంది. మీరు జియో ఫైబర్ యూజర్స్ అయితే 3300 జీబీ డేటా లభిస్తుంది. అలాగే ఎయిర్ ఫైబర్ యూజర్స్ అయితే మీకు 1000 జీబీ డేటా లభిస్తుంది. ఓటీటీల విషయానికి వస్తే.. జియో సినిమా, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ బేస్ ప్లాన్ వంటి మొత్తం 15 ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నారు.

టీవీ ఛానల్స్ ని కూడా అందిస్తున్నారు. ఏకంగా 800 డిజిటల్ టీవీ ఛానల్స్ పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ కింద మీరు రీఛార్జ్ చేసుకుంటే 50 రోజుల పాటు మీరు ఈ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఎక్కువ ఆలోచించుకునే సమయం మీకు లేదండోయ్. కేవలం మే 31 వరకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని.. జియో సంస్థ వెల్లడిస్తోంది. మరి.. జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్స్ వినియోగదారుల కోసం జియో సంస్థ తీసుకొచ్చిన ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments