మీ జీతం రూ.30వేలు పైనా? 2024 నుండి ఈ 3 విషయాలు ఫాలో అవ్వండి!

2023 ముగిసిపోయింది. 2024లోకి అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా కొంత మంది రెసల్యూషన్స్ చేస్తుంటారు. ఈ ఏడాది ఇలా చేయాలి.. అలా చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఏ ప్రణాళిక చేసుకున్నా.. రూపాయితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి.. 3 విషయాలు ఫాలో అవ్వండి.

2023 ముగిసిపోయింది. 2024లోకి అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా కొంత మంది రెసల్యూషన్స్ చేస్తుంటారు. ఈ ఏడాది ఇలా చేయాలి.. అలా చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఏ ప్రణాళిక చేసుకున్నా.. రూపాయితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి.. 3 విషయాలు ఫాలో అవ్వండి.

కూడు, గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రధాన అవసరాలు. వీటిని పొందాలంటే కావాల్సిన విలువైన ఆయుధం మనీ. ప్రస్తుతం దీని చుట్టూనే ప్రపంచం నడుస్తుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అంటుంటారు పెద్దలు. వచ్చిన సంపాదన అంతా.. ఖర్చు పెట్టేసి.. నెల చివరిలో జీతం ఎప్పుడు పడుతుందా అనే చూసే సగటు మనిషిలా ఆలోచించకుండా.. ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఆర్థికపరమైన బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఇప్పటి వరకు సంపాదనలో రూపాయి కూడా దాయలేకపోతుంటే.. ఇప్పుడు నుండే మొదలు పెట్టండి. ఈ ఏడాది ఎలాగో గడిపోయింది.. 2024 నుండైనా సేవింగ్స్ చేసేందుకు సిద్దపడండి. ఇది అందరికీ సాధ్యపడక పోవచ్చు కానీ.. మధ్యతరగతి జీవితాలకు అంటే రూ. 30 నుండి 35 వేల జీతం వచ్చే సగటు ఉద్యోగి మాత్రం దీన్ని పాటిస్తే.. అద్భుతమైన ఫలితాలు చూస్తారు.

సాధారణంగా ఈ జీతాన్ని ఎక్కువగా పరిగణించలేం అలా అని తక్కువ అని తీసేయలేం. కానీ ఓ మంచి వేతనంగా పరిగణించవచ్చు. ఇక ఈ వేతనం తీసుకుంటున్న వ్యక్తి ఆర్థికంగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. లేకపోతే.. లైఫ్ బోల్తా కొట్టే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా లోన్లు జోలికి అస్సలు పోవద్దు. రూ. 30 వేలు జీతాలు వస్తున్నాయంటే పర్సనల్ లోన్‌తో పాటు ఇతర రుణాలు ఇచ్చేందుకు సంప్రదిస్తుంటాయి బ్యాంకులు. డబ్బుకు ఇస్తామన్నప్పుడు తియ్యగానే ఉంటుంది. కానీ అవి కట్టే సమయంలో అసలు సమస్య  మొదలు అవుతుంది. ఏ రుణానికైనా చాలా వడ్డీ ఉంటుంది. అసలు ప్లస్ వడ్డీ తడిసిమోపెడు అవుతుంది. ఒక్క నెల ఈఎంఐలు కట్టకపోతే.. పరువు తీసేస్తుంటారు బ్యాంకు ఏజెంట్స్. అందుకే రుణాలు అత్యవసరం అయితే తప్పితే.. వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాగే వ్యక్తుల నుండి కూడా అప్పులు చేయవద్దు.

 ఇప్పుడు సేవింగ్స్ విషయానికి వస్తే.. ఇంటి నెల ఖర్చులు, ఇతర ఖర్చులు వెరసి.. చాలా అయిపోతుంటాయి. చివరికి రూపాయి కూడా దాయటానికి కూడా ఉండదు. కానీ కచ్చితంగా, కాస్త కఠినంగా ఉంటే.. సాధ్యమే.. నెలకు రూ. 30 వేలు అంటే.. రోజుకు రూ. వెయ్యి జీతం వస్తుంది. ఇందులో నుండి రోజుకు వంద రూపాయలు చొప్పున తీసినా.. నెలకు మూడు వేలు అవుతుంది. వీటిని పోస్టాఫీస్, ఎల్ఐసీ, ఇతర సేవింగ్స్‌లో పెట్టుబడి పెడితే.. వెంటనే రిటర్స్న్ చూస్తామనుకుంటే పొరపాటు. ఇవి దీర్ఘకాలంలో మంచి రిటర్స్న్ గా మారి.. ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తాయి. ఇవి ఇప్పటి నుండి స్టార్ చేస్తే.. అలవాటు పడుతుంది.. ఆర్థికంగా మనకంటూ కొంత నగదును పొందుతాం. సేవింగ్స్ అనేవి జీవితానికి ప్రాణం పోసే ఆక్సిజన్ లాంటిది. ఎంత ఎక్కువ సేవింగ్ ఉంటే.. అంత ఆర్థిక ఆలంబన.

ఇక అన్నింటి కన్నా ముఖ్యమైనవి.. ఆపేయాలన్న ఆగలేనివి ఖర్చులు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు. వచ్చిన సంపాదనకు తగ్గట్లే ఖర్చులు కూడా ఉంటాయి. అయితే వీటిల్లో అనవసరపు ఖర్చులు కూడా ఉంటాయి. అవి ఎక్కడ, ఎందుకు ఖర్చు పెడుతున్నామో లెక్కలు వేయగలిగితే.. చాలా వరకు సక్సెస్ అయినట్లే. మరీ ముఖ్యంగా వినోదం కోసం, స్నేహితులతో వెళ్లే సమయంలో పెట్టే ఖర్చు విషయంలో కాస్త వెనుకా ముందు ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే ఇటీవల జనాలతో ఖర్చులు చేయించేందుకు వస్తున్నాయి ఆన్ లైన్ యాప్స్. అవసరం ఉన్నా లేకున్నా.. పండగ ఆఫర్లు అంటే చాలు దండిగా దండగ ఖర్చు పెడుతున్నారు. అందులో వచ్చే ఆఫర్ కు బోల్తా పడి.. మీ సమయంతో పాటు డబ్బులను వృధా చేసుకుంటున్నారు. వీటిని ఆపేయాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకున్న వస్తువులను ఇదే ఆఫర్లలో తక్కువ పొంది కూడా సేవింగ్ చేయొచ్చు. సో మీ జీతంతోనే సెక్యూర్డ్ అండ్ సెటిల్డ్ లైఫ్ సెట్ చేసుకోవచ్చు. ఈ సూచనలు వాస్తవమని భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments