iDreamPost
android-app
ios-app

అకౌంట్ లో పైసా లేకపోయినా.. రూ.80 వేలు డ్రా చేసుకున్నారు!

అకౌంట్ లో పైసా లేకపోయినా.. రూ.80 వేలు డ్రా చేసుకున్నారు!

సాధారణంగా ఇప్పుడు లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోవడం చాలా తగ్గిపోయింది. అందరూ అన్ని ట్రాన్సాక్షన్స్ ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. కానీ, కొన్నిసార్లు మాత్రం తప్పకుండా లిక్విడ్ క్యాష్ తో అవసరం పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మీరు బ్యాంక్ దాకా వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. దగ్గర్లో ఉన్న ఏటీఎంకి వెళ్లి డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోబోయే ఏటీఎం గురించి చెబితే మీరు నోరెళ్లబెట్టేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీ ఖాతాలో పైసా లేకపోయినా.. రూ.80 వేలు వరకు వచ్చేస్తున్నాయంట. మరి.. ఆ వివరాలేంటో చూడండి.

సాధారణంగా గత కొంతకాలంగా కొన్నిసార్లు ఏటీఎంల గురించి కొన్ని వింత వార్తలు వినే ఉంటారు. అదేంటంటే.. రూ.500 డ్రా చేస్తే రూ.వెయ్యి వచ్చాయని. ఎంటర్ చేసిన అమౌంట్ కు డబుల్ మొత్తంలో బయటకు వచ్చాయని వినే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వార్త వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మీ ఖాతాలో ఎలాంటి బ్యాలెన్స్ లేకపోయినా.. చాలామంది రూ.80 వేలు డ్రా చేసుకున్నారు. ఆ విషయం తెలిసి అక్కడ వారంతా పరుగులు పెట్టారు. ఎందుకంటే రూ.80 వేలు అంటే చిన్న మొత్తం కాదు కదా. అయితే ఇదంతా జరిగింది ఇక్కడ కాదులెండి.. ఐర్లాండ్ దేశంలో జరిగింది. ఐర్లాండ్ బ్యాంకుకు సంబంధించిన సర్వర్ లో ఒక టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దాని వల్ల ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు అంతరాయం ఏర్పడింది. డిజిటల్ అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ ఫర్ చేసుకుని 1000 డాలర్ల వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఏటీఎం ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకున్న కొందరికి వారి ఖాతాలో నగదు లేకపోయినా.. 1000 డాలర్లు అందాయి. ఖాతాలో డబ్బు లేకపోయినా కూడా డిజిటల్ ఖాతా నుంచి ఏటీఎం ద్వారా 1000 డాలర్లు విత్ డ్రా చేసుకోవచ్చు అనే వార్త ఐర్లాండ్ మొత్తం పాకింది. అందరూ ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. గరిష్టంగా 1000 డాలర్లు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం దక్కింది. చాలా మంది కస్టమర్లు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు కూడా. ఏటీఎంల వద్ద గుమిగూడిన ప్రజలను క్లియర్ చేసేందుకు పోలీసులు చాలానే కష్టపడాల్సి వచ్చింది. సర్వర్ లో టెక్నికల్ గ్లిట్చ్ వచ్చిన విషయాన్ని బ్యాంకు వాళ్లు కూడా అంగీకరించారు. అయితే ఎవరూ వారి ఖాతాలో ఉన్న మొత్తం కంటే ఎక్కువ విత్ డ్రా చేసుకోవద్దని సూచించారు. అలా చేసుకుంటే వారి ఖాతా నుంచి ఆ మొత్తాన్ని డెబిట్ చేస్తామని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ టెక్నికల్ గ్లిట్చ్ గురించే చర్చ. చాలామంది మాత్రం ఈ లక్కీ ఛాన్స్ మాకు ఎందుకు రాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.