ICUలో రతన్ టాటా?.. ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన పారిశ్రామిక దిగ్గజం

Ratan Tata: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అనారోగ్యానికి గురయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు రతన్ టాటా.

Ratan Tata: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అనారోగ్యానికి గురయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు రతన్ టాటా.

టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా బిజినెస్ వరల్డ్ లో పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్ వైడ్ గా రతన్ టాటా గురించి తెలియని వారుండరనడంలో ఎలాంటి సందేహం లేదు. టాటా కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి రతన్ టాటా కృషినే కారణం. పారిశ్రామిక రంగంలో అందనంత ఎత్తుకు ఎదిగారు. ప్రపంచంలోని గొప్ప పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా నిలిచారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతం. అంతకు మించి గొప్ప మానవతావాది. టాటా కంపెనీ పట్ల, ఉత్పత్తుల పట్ల ప్రజల్లో విశ్వాసం కలగడానికి ప్రధాన పాత్ర పోషించింది రతన్ టాటా అని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఆయన వయసు 86 ఏళ్లు. ఇదిలా ఉంటే రతన్ టాటా అనారోగ్యానికి గురయ్యాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. దీంతో వ్యాపార వర్గాలతో పాటు ప్రజలు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై స్పందించారు. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని.. ఇప్పటికీ తాను ఉత్సాహంగానే ఉన్నట్లు వివరించారు. తాను బాగానే ఉన్నానని అన్నారు. తను అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

రతన్ టాటా అధికారిక ఖాతా ఎక్స్ వేదికగా ఓ లెటర్ పోస్టు చేశారు. ‘నా ఆరోగ్యంపై వస్తున్న పుకార్ల గురించి తెలిసింది. అందుకే నేను దీని గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. నా వయసు రీత్యా.. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నేను ప్రస్తుతం క్షేమంగా ఉన్నా. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని.. ప్రజలు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.’ అని రతన్ టాటా ఎక్స్ లో ట్వీట్ చేశారు. తన ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు ప్రజలకు రతన్ టాటా కృతజ్ఞతలు తెలిపారు.

కాగా టాటా సంస్థలో రతన్ టాటా గౌరవ ఛైర్మన్ హోదాలో కొనసాగుతున్నారు. టాటా సంస్థ ఆటోమోటివ్, ఏరో స్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఏవియేషన్, ఇ- కామర్స్, టూరిజం సెక్టార్లు ఇలా చాలా వాటిల్లో టాటా గ్రూప్ సబ్సిడరీలు ఉన్నాయి. రతన్ టాటా సేవలకు గానూ.. 2008లో భారత ప్రభుత్వం ఈయన్ను దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

Show comments