మహిళల భద్రత కోసం లేడీస్-ఓన్లీ సీటింగ్ ఆప్షన్‌ని పరిచయం చేసిన ఇండిగో

Indigo Airlines: ప్రముఖ ఎయిర్‌ లైన్‌ సంస్థ ఇండిగో తాజాగా మహిళా ప్రయాణికుల సౌకర్యం పై దృష్టి సారించి ఓ శుభవార్త అందించింది. ఇంతకీ అదేమిటంటే..

Indigo Airlines: ప్రముఖ ఎయిర్‌ లైన్‌ సంస్థ ఇండిగో తాజాగా మహిళా ప్రయాణికుల సౌకర్యం పై దృష్టి సారించి ఓ శుభవార్త అందించింది. ఇంతకీ అదేమిటంటే..

ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణాలు అనేవి బాగా పెరిగాయి. ఈ క్రమంలోనే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్లైట్ జర్నీ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక ఈ విమానాల్లో ప్రయాణించే వారి కోసం పలు ఎయిర్ లైన్స్  సంస్థలు ఎప్పటికప్పుడు పలు సేవలను అందిస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికులను ఆకర్షించే విధంగా పలు సేవలు అందించడంలో..  ప్రముఖ ఇండిగో సంస్థ ఎప్పుడు ముందుంటుదనే చెప్పచ్చు. ఎందుకంటే.. ఈ ఎయిర్‌ లైన్‌ సంస్థ   ప్రయాణికలకు ఎప్పటికప్పుడు టికెట్‌ ఛార్జీలను తగ్గించడం వంటి పలు  బంఫర్‌ ఆఫర్స్‌ ను ప్రకటిస్తుంటాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఈ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ మహిళా ప్రయాణికులకు ఓ గుడ్‌ న్యూస్‌ ప్రకటించింది. ఇంతకీ అదేమిటంటే..

తాజాగా మహిళా ప్రయాణికుల కోసం ప్రముఖ ఎయిర్‌ లైన్‌ సంస్థ ఇండిగో ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  మహిళా ప్రయాణికుల సౌకర్యర్ధం  సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విమానంలో మహిళ ప్రయాణికులు సీట్ బుకింగ్ చేసే సమయంలో వారి సీటు పక్కన మగ ప్రయాణికులుంటే.. ముందే ఆ సమాచారాన్ని ఇండిగో సంస్థ తెలియజేయనుంది. అంతేకాకుండా.. టికెట్‌ బుకింగ్‌ సమయంలో పింక్ రంగులో ఉన్న సీట్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని మహిళలకు అందించనుంది. అయితే ఈ సేవలు అనేవి కేవలం మహిళా ప్రయాణికులకు మాత్రమే కనిపిస్తాయని తెలిపింది.

అందుకోసం  విమాన టికెట్‌  బుకింగ్ సమయంలో  ప్రయాణికులు తమ జెండర్‌ ను కచ్చితంగా తెలియజేయాలి. ఇకపోతే ఇండిగో ఈ సేవలనేవి ఈ ఏడాది  మే నెల నుంచి ట్రయిల్స్‌ నడుస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ అప్షన్‌ ప్రయాణికుల ముందుకు తీసుకురానుంది. ఒకవేళ ఈ ఆప్షన్‌ కనుకు అందుబాటులోకి వస్తే.. ఇక నుంచి మహిళకు బస్సుల్లో ఎలా ప్రత్యేకమైన సీట్లు ఉంటాయో, విమానంలో కూడా అదే మాదిరిగా ప్రత్యేకగా సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. మరీ, ఎయిర్‌ ఇండిగో సంస్థ టికెట్‌ బుకింగ్‌ సమయంలో.. మహిళా ప్రయాణికుల సౌకర్యం కోసం తీసుకొచ్చిన ఈ స్పెషల్‌ ఆప్షన్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments