iDreamPost
android-app
ios-app

వందేభారత్ ని మించిన రైలు.. దాని ప్రత్యేకతలు ఇవే!

  • Published Aug 02, 2024 | 4:50 PM Updated Updated Aug 02, 2024 | 4:50 PM

Indian Railway: దేశంలో ప్రయాణికులకు అత్యాధునిక సేవలతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఇప్పటికే తమవంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వందేభారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే మరో అద్బుతమైన ప్రాజెక్టును రైల్వే చేపట్టనుంది. ఇంతకీ అదేమిటంటే..

Indian Railway: దేశంలో ప్రయాణికులకు అత్యాధునిక సేవలతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఇప్పటికే తమవంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వందేభారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే మరో అద్బుతమైన ప్రాజెక్టును రైల్వే చేపట్టనుంది. ఇంతకీ అదేమిటంటే..

  • Published Aug 02, 2024 | 4:50 PMUpdated Aug 02, 2024 | 4:50 PM
వందేభారత్ ని మించిన రైలు.. దాని ప్రత్యేకతలు ఇవే!

దేశంతో రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు మోడి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వందే భారత్ రైళ్లను అందుబాదుటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావడంతో.. ప్రజలకు ప్రయాణం మరింత సులభంగా మారింది. ఈ క్రమంలోనే.. దేశంలో ప్రధాన నగరాల మధ్య ఈ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా అత్యంత టెక్నాలజీతో రూపొందించిన ఈ వందే భారత్ రైలులో ప్రయాణం చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు వీటితో పాటు బుల్లెట్ ట్రైన్స్ కూడా త్వరలో దేశంలోని అందుబాటులోకి వస్తాయని ఇటీవలే సమాచారం అందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే మరో అద్బుతమైన ప్రాజెక్టును రైల్వే చేపట్టనుంది. ఇంతకీ అదేమిటంటే..

దేశంలో ప్రయాణికులకు అత్యాధునిక సేవలతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఇప్పటికే తమవంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వందేభారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా,  మరో రెండళ్లలో కొత్తగా దేశంలోని  బుల్లెట్ రైలు కూడా పరుగులు తీయనున్నాయి. కాగా, ఇది దేశంలో తొలి బుల్లెట్ రైలుగా ముంబాయి నుంచి అహ్మదాబాద్ మధ్య 2027లో ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే కసరత్తు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ రైలుకు సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో అద్భుతమైన ప్రాజెక్టును తాజాగా రైల్వే శాఖ చేపట్టింది. అదేమిటంటే.. ఈ ఏడాది చివరి నాటికి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ రైల్లను 2047 చివరి నాటికి 50 రైళ్లుగా నడపాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుందని ఫిక్కీ ఫ్యూచర్ రైలు ఇండియా 2024 కాన్ఫరెన్స్‌లో రైల్వే బోర్డు సభ్యుడు అనిల్ కుమార్ ఖాండెల్వాల్ తెలిపారు.

కాగా, ప్రస్తుతం ప్రపంచంలో కేవలం జర్మనీ మాత్రమే ఈ హైడ్రోజన్ రైళ్లను నడుస్తున్నాయి. అయితే ఇవి ఇండియాలోకి అందుబాటులోకి వస్తే.. ఈ హైడ్రోజన్ రైలు నడుపుతున్న రెండో దేశంగా భారత్ నిలుస్తుంది. పైగా ఈ రైల్లు  కాలుష్యాన్ని నివారించడంలోపాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఇక ఈ తొలి రైలు హరియాణాలోని జింద్ నుంచి సోనేపట్ మధ్య నడపనున్నారు. ఇక విషయం పక్కన పెడితే.. హైడ్రోజన్ అనేది స్థిరమైన ఇంధనం. కనుక ఈ రైలు ఆక్సిజన్, హైడ్రోజన్ సంయోగం వల్ల ఇంజన్‌ పనిచేయడానికి అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఈ రైలులో కేవలం . ఎనిమిది బోగీలు మాత్రమేఉంటాయి. ముఖ్యంగా ఈ రైలు కాలుష్యంను తగ్గిస్తుంది. అలాగే ఇందులో నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ డయాక్సైడ్, పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి ప్రమాదకర కాలుష్య కారకాలు విడుదల కావు.

ఇకపోతే హరియాణా ఝజ్జర్ జిల్లాలోని గ్రీన్‌హెచ్ కంపెనీ కొత్తగా నిర్మించిన ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ (PEM) ఎలక్ట్రోలైజర్ తయారీ ప్లాంట్‌లో ఈ రైలును నడిపేందుకు అవసరమైన పరికరాలు ఉత్పత్తి చేస్తున్నారు. వీటితోపాటు రీఫ్యూయిలింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 3,000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేయడంతోపాటు, హైడ్రోజన్ కంప్రెజర్లు, రెండు హైడ్రోజన్ డిస్పెన్సర్లను ప్రీ-కూలర్ ఇంటిగ్రేషన్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల త్వరగా హైడ్రోజన్ ఇంధనాన్ని రైళ్లలో నింపవచ్చు. మరీ, త్వరలో దేశంలోని ఈ హైడ్రోజన్ రైలును అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.