Keerthi
ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు ఈ ఇండియన్ రైల్వే సేవలను వినియోగించుకుంటారు. అయితే ఈ రైలు ప్రయాణంలో కొన్నిసార్లు ప్రయాణికులకు కొంత అసౌకర్యనికి గురవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం తాజాగా రైల్వే సంస్థ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు ఈ ఇండియన్ రైల్వే సేవలను వినియోగించుకుంటారు. అయితే ఈ రైలు ప్రయాణంలో కొన్నిసార్లు ప్రయాణికులకు కొంత అసౌకర్యనికి గురవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం తాజాగా రైల్వే సంస్థ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
Keerthi
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశాల్లో ఇండియన్ రైల్వే కూడా ఒకటి. ఇక్కడ ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణికులు ఈ ఇండియన్ రైల్వే సర్వీస్ ను వినియోగిస్తూ తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ముఖ్యంగా.. ఏదైనా దూర ప్రాంతాలకు తొందరగా, సురక్షితంగా వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ రైలు ప్రయాణం అనేది ఎంతో మేలుగా ఉంటుంది. పైగా ఈ రైళ్ల ప్రయాణం అనేది ఇతర రావాణా అనగా బస్సులు, ఆటోలు, విమానాలతో పొలిస్తే టికెట్ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో సామాన్య ప్రజలు కూడా ఈ రైలు ప్రయాణానికి చాలా మెగ్గు చూపుతుంటారు.అలాగే ఇక్కడ ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యంగా ఉన్న ఇక వారి అవసరాలకు అనుగుణంగా రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడంలో ముందుటుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇచ్చే ఫిర్యాదు మేరకు తాజాగా రైల్వే సంస్థ ప్రయాణికుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రైల్వే ప్రయాణికులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు ఈ ఇండియన్ రైల్వే సేవలను వినియోగించుకుంటారు. అయితే ఈ రైలు ప్రయాణంలో కొన్నిసార్లు ప్రయాణికులు అసౌకర్యనికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా.. వారిలో సీనియర్ సీటిజన్లు కూడా ఉంటారు. ఎందుకంటే.. ఈ సీనియర్ సీటిజన్లు ఎక్కువగా లోయర్ బెర్త్ లను కోరుకుంటారు. కానీ, రాత్రి సమయంలో ప్రయాణించే వారికి లోయర్ బర్త్ కి బదులుగా.. కొన్నిసార్లు అప్పర్ బెర్త్ వస్తుంది. ఆ సమయంలో వారు పైకి ఎక్కలేక పడుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీంతో లోయర్ బర్త్ లో ఉన్న ప్రయాణకులకు రిక్వెస్ట్ చేసి వారి సీటులను ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. అయితే ఇకపై సీనియర్ సీటిజన్లకు ఈ సమస్య లేకుండా.. రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం రైల్వే సంస్థ సీనియర్ సీటిజన్లకు లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్‌కు ప్రాధాన్యతనిస్తూ.. కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
అయితే రైలు ప్రయాణం చేసిన సమయంలో సీనియర్ సిటిజన్‌ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఇకపై సీనియర్ సిటిజన్ లకు లోయర్ బెర్త్ లపై రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. కాగా, తాజాగా ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులైన బంధువు కోసం లోయర్ బెర్త్‌ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్‌ల కేటాయింపుపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ప్రశ్నించాడు. అయితే ఆ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్‌తో స్పందించిన అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించి ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే ఇక టికెట్లను బుక్ చేసుకునే సమయంలో.. లోయర్ బెర్త్ కావాలనుకునే వారు లోయర్ బెర్త్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ విధానంలో సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. మరి, రైల్వే సంస్థ ప్రయాణికులు అందించే ఈ గుడ్ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.