iDreamPost
android-app
ios-app

వాహనదారులకు బిగ్‌ షాక్‌.. టోల్‌ ఛార్జీల మోత.. వివరాలివే

  • Published May 22, 2024 | 9:57 AM Updated Updated May 22, 2024 | 9:57 AM

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు తాజాగా ఓ బిగ్‌ షాక్‌ తగిలింది. ఇకపై హైవేలపై ప్రయాణించే వాహనదారులకు టోల్‌ ప్లాజాల్లో ఛార్జీలు పెరగనున్నాయి. ఆ వివరాలివే..

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు తాజాగా ఓ బిగ్‌ షాక్‌ తగిలింది. ఇకపై హైవేలపై ప్రయాణించే వాహనదారులకు టోల్‌ ప్లాజాల్లో ఛార్జీలు పెరగనున్నాయి. ఆ వివరాలివే..

  • Published May 22, 2024 | 9:57 AMUpdated May 22, 2024 | 9:57 AM
వాహనదారులకు బిగ్‌ షాక్‌.. టోల్‌ ఛార్జీల మోత.. వివరాలివే

దేశంలో ఉన్న వాహనదారులకు మరో పిడుగు లాంటి వార్త అందింది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్న ఈ క్రమంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్‌ షాక్‌ ను ఇచ్చింది. ఎందుకంటే.. ఇకపై నేషనల్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ వేలపై వెళ్లడం మరింత ఖరీదుగా మారనుంది. అనగా.. టోల్ ట్యాక్స్‌ ఛార్జీలను భారీగా పెంచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్దమైంది. ఎప్పటి నుంచి ఈ ఛార్జీల పెంపు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు తాజాగా ఓ బిగ్‌ షాక్‌ తగిలింది. ఇకపై హైవేలపై ప్రయాణించే వాహనదారులకు టోల్‌ ప్లాజాల్లో ఛార్జీలు పెరగనున్నాయి. అయితే ఈ టోల్‌ గేట్‌ ఛార్జీలు జూన్ 2 నుంచి పెంపు అమల్లోకి రానుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వెల్లడించింది. ఇకపోతే ప్రతి ఏటా ఏప్రిల్‌ 1న ఈ రుసుములు పెరుగుతాయి. అయితే రోడ్ల నిర్వహణకు ఈ ఛార్జీలను పెంచుతారు.  ఇక ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. ఈ క్రమంలోనే.. టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది కాగా, దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. చివరి విడత జూన్‌ 1న ఎన్నికలు ముగియనున్నాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచి ఈ టోల్‌ ఛార్జీల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఈ మేరకు టోల్‌ప్లాజాల నిర్వాహకులకు NHAI ఉత్తర్వులను జారీ చేసింది. పైగా ఈ టోల్‌ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది.

Big shock for motorists

ఇక హైదరాబాద్‌, విజయవాడ (65) నేషనల్ హైవేను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ హైవేపై తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. అయితే అక్కడ కార్లు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10, తేలికపాటి గూడ్స్ వెహికల్స్ ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20 ఉంటుంది. అదే విధంగా బస్సు, ట్రక్కులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాల అయితే రూ.35, రూ.50 చొప్సున పెంచారు. కాకపోతే 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు ఛార్జీలో 25 శాతం మినహాయింపు ఉంటుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్‌ను కూడా పెంచారు. ఆ పాసులను రూ.330 నుంచి 340కి పెంచారు. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉండనున్నాయి. మరి, ఒక్కసారిగా టోల్‌ ఛార్జీల పెంపు పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.