iDreamPost
android-app
ios-app

EV ఛార్జింగ్ సమస్యలకు చెక్.. ఇక సోలార్ పవర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు

మీరు ఈవీలను వాడుతున్నారా? ఛార్జింగ్ సమస్యలతో ఇబ్బందుల పడుతున్నారా? ఇక మీ సమస్యలకు చెక్ పడినట్లే? సోలార్ పవర్ తో ఛార్జ్ చేసుకునేలా సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది ఐఐటీ-జోధ్‌పూర్.

మీరు ఈవీలను వాడుతున్నారా? ఛార్జింగ్ సమస్యలతో ఇబ్బందుల పడుతున్నారా? ఇక మీ సమస్యలకు చెక్ పడినట్లే? సోలార్ పవర్ తో ఛార్జ్ చేసుకునేలా సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది ఐఐటీ-జోధ్‌పూర్.

EV ఛార్జింగ్ సమస్యలకు చెక్.. ఇక సోలార్ పవర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతున్నది. భవిష్యత్తులో ఈవీల వాడకమే ఎక్కువగా ఉండనున్నది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తున్నది. ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థలన్నీ కూడా ఈవీలను రూపొందించే పనిలో పడ్డాయి. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకునేందుకు వాహనదారులు ఈవీల కొనుగోలుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. బడ్జెట్ ధరల్లోనే ఈవీ బైకులు, స్కూటర్లు వస్తుండడంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటోంది. అయితే ఈవీలు సింగిల్ ఛార్జ్ తో 100 కి.మీలకు పైగా ప్రయాణించే సౌకర్యం ఉంది కానీ ఛార్జింగ్ సమస్య ఇబ్బందిగా మారింది. ఈవీ ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తే బాగుండని అనుకుంటున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇక సోలార్ పవర్ తో ఈవీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఐఐటీ-జోధ్‌పూర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ స్పెషల్ అడాప్టర్‌ను అభివృద్ధి చేసింది.

పెట్రోల్ కార్ల కంటే ఈవీ కార్లను కొనేందుకు ఆసక్తికనబరుస్తున్నారు వాహనదారులు. ఎందుకంటే ఈవీల వినియోగానికి ఖర్చు చాలా తక్కువ కాబట్టి. అయితే ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ సమయం ఎక్కవ పడుతుండడంతో సమస్యగా మారింది. దీనికి తోడు ఛార్జింగ్ పాయింట్స్ కూడా తక్కువగా ఉండడం మరింత ఇబ్బందిగా మారింది. దీనికి పరిష్కారాన్ని కనుగొన్నది జోధ్ పూర్ ఐఐటీ. ఇందుకోసం ఓ స్పెషల్ అడాప్టర్ ను డెవలప్ చేసింది. దీని సాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను సోలార్ పవర్ ను ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. రూ.1,000 కంటే తక్కువ ధరకే లభించనుంది. ఈ అడాప్టర్ సోలార్ ప్యానెల్ విజయవంతమైతే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తమ వాహనాలను ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదని, సమయం ఆదా అవుతుందని ఐఐటీ జోధ్‌పూర్‌ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ తెలిపారు.

ఈ అడాప్టర్ అన్ని రకాల వాహనాలలో పని చేస్తుందని, దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించామని అన్నారు. త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కొండలు, మారుమూల ప్రాంతాలు, విద్యుత్ సదుపాయం లేని, ఛార్జింగ్ సదుపాయం లేని ఏరియాల్లో ఉపయోగపడుతుందని తెలిపారు. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లతో ఈవీల ఛార్జింగ్ సమస్యలకు పరిష్కారం లభించినట్లవుతుంది.