iDreamPost
android-app
ios-app

ఏటీఎం కార్డు ఉంటే చాలు.. ఐదు రకాల ఇన్సూరెన్సులు పొందొచ్చని మీకు తెలుసా?

ఏటీఎం కార్డులు లావాదేవీలకే కాదు, బీమా సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. బ్యాంకులు డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్ ద్వారా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. డెబిట్ కార్డు ద్వారా ఏకంగా ఐదు రకాల ఇన్సూరెన్స్ లను పొందొచ్చు.

ఏటీఎం కార్డులు లావాదేవీలకే కాదు, బీమా సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. బ్యాంకులు డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్ ద్వారా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. డెబిట్ కార్డు ద్వారా ఏకంగా ఐదు రకాల ఇన్సూరెన్స్ లను పొందొచ్చు.

ఏటీఎం కార్డు ఉంటే చాలు.. ఐదు రకాల ఇన్సూరెన్సులు పొందొచ్చని మీకు తెలుసా?

ఊహించని ప్రమాదాలు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తుంటాయి. ముఖ్యంగా కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కాబట్టి అంతా సవ్యంగా ఉన్నప్పుడే బీమా చేయించకున్నట్లైతే, ఆ వచ్చే బీమా సొమ్ముతో కుటుంబం ఆర్థికంగా నిలదొక్కకుంటుంది. కాగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు కంపెనీలు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇన్సూరెన్స్ పాలసీని ఓపెన్ చేసి ప్రీమియం చెల్లించినట్లైతే, బీమాదారుడు దురదృష్టవషాత్తు మరణించినపుడు ఆ బీమా మొత్తాన్ని ఆ వ్యక్తి కుటుంబానికి లేదా నామినీకి అందిస్తుంటాయి. అయితే బీమా కంపెనీలే కాదు మన వద్ద ఉన్న ఏటీఎం కార్డుల ద్వారా కూడా బీమాను పొందొచ్చు. ఒకటి కాదు ఏకంగా ఐదు రకాల ఇన్సూరెన్సులను పొందే అవకాశం కల్పిస్తున్నాయి బ్యాంకులు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. కానీ నేడు ఏటీఎం మిషన్స్ అందుబాటులోకి రావడంతో ఏటీఎం కార్డుల సహాయంతో ఎప్పుడంటే అప్పుడు నగదును పొందొచ్చు. అయితే బ్యాంకులు కస్టమర్లకు సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఏటీఎం కార్డులను జారీ చేస్తాయి. కాగా ఈ ఏటీఎం కార్డుల సాయంతో మరో ప్రయోజనం కూడా ఉంది. డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్ కింద బీమా సౌకర్యాన్ని పొందొచ్చు.

దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదు. మీరు వాడుతున్న ఏటీఎం కార్డులకు ప్రతి సంవత్సరం చార్జీల కింద బ్యాంకు కొంత మొత్తాన్ని మీ ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది. అందులో కొంత మొత్తం వినియోగదారు పేరు మీద బ్యాంకు తరఫున జీవిత బీమా కంపెనీలకు వెళ్తుంది. ఇందుకోసం బ్యాంకులు ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు బ్యాంకులు బీమా ప్లాన్ ను అందిస్తుంటాయి. ఈ విధంగా డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్ ద్వారా ఐదు రకాల ఇన్సూరెన్స్ లను పొందొచ్చు.

ఐదు రకాల ఇన్సూరెన్స్

1.ఖాతా నుంచి డబ్బులు చోరీకి గురైనప్పుడు

సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకో ఎత్తుగడలతో ఖాతాలు లూటీ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు చోరీకి గురైనా, లేదా డెబిట్ కార్డు ద్వారా ఎవరైనా దొంగ చెల్లింపులు చేసినా వాటికి ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది.

2.వ్యక్తిగత ప్రమాద బీమా

ఏటీఎం కార్డు వినియోగదారుడు ప్రమాదానికి గురై మరణం సంభవిస్తే వారిపై ఆధారపడిన వారు బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

3.విమాన ప్రమాద బీమా

ఫ్లైట్ జర్నీ చేసేటపుడు ప్రమాదం జరిగినా లేదా మరణం సంభవించినా ఈ బీమా పొందొచ్చు.

4.వస్తువుల కొనుగోళ్లకు భద్రత

ఏటీఎం కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు పోయినా లేదా చోరీకి గురైనా బీమా పొందవచ్చు.

5. ప్రయాణంలో వస్తువులు పోయిన లేదా పాడైపోయినా బీమా

ప్రయాణంలో మీ వస్తువులు పోయినా లేదా ధ్వంసమైనా బీమా పొందే అవకాశం ఉంది.