iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు IDFC బ్యాంక్ గుడ్ న్యూస్.. ఏకంగా 2 లక్షల స్కాలర్‌షిప్

IDFC First Bank Scholarship: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రెండు లక్షల స్కాలర్ షిప్ అందిస్తున్నది.

IDFC First Bank Scholarship: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రెండు లక్షల స్కాలర్ షిప్ అందిస్తున్నది.

విద్యార్థులకు IDFC బ్యాంక్ గుడ్ న్యూస్.. ఏకంగా 2 లక్షల స్కాలర్‌షిప్

ప్రస్తుత రోజుల్లో చదువు చాలా కాస్ట్లీ అయిపోయింది. స్కూల్ ఫీజులు, బుక్స్, యూనిఫాం పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలు, లక్షల రూపాయలను గుంజుతున్నాయి కొన్ని స్కూల్స్. తమ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలనుకునే తల్లిదండ్రులకు మరింత ఆర్థిక భారం అవుతున్నది. చదువు ఒక్కటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని నమ్ముతున్నారు. చదువుకు ఇంపార్టెన్స్ పెరగడంతో ఖర్చుకు వెనకాడకుండా పిల్లలను చదివిస్తున్నారు. డబ్బు లేని కారణంగా ఎంతో మంది చదువుకు దూరమవుతున్నారు. అయితే పేద విద్యార్థులకు చదువుకు అయ్యే ఖర్చులు భారం కాకూడదని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించేందుకు ముందుకొచ్చింది.

ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్ షిప్ ప్రోగ్రాం 2024 ద్వారా విద్యార్థులకు చేయూతనందించేందుకు స్కాలర్ షిప్ ను అందిస్తోంది. అర్హులైన ఎంబీఏ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కాలర్ షిప్ పొందేందుకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సూచించిన విద్యాసంస్థల్లో 2024 అకాడమిక్ ఇయర్ రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించకూడదు. ఏడాదికి లక్ష చొప్పున రెండు సంవత్సరాలకు కలిపి రెండు లక్షలు అందిస్తారు. అయితే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఈ స్కాలర్ షిప్ లను మొత్తం 350 మందికి అందించనున్నారు.

ఈ స్కాలర్ షిప్ ను పొందేందుకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అడ్మిషన్ సంబంధిత ధృవీకరణ పత్రాలైన డిగ్రీ మార్క్స్ షీట్, ఆదాయ ధృవపత్రం తదితర వివరాలను అప్ లోడ్ చేయాలి. పూర్తి సమాచారం కోసం mbascholarship@idfcfirstbank.comను సంప్రదించవచ్చు. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరమయ్యే విద్యార్థులకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అందించే స్కాలర్ షిప్ ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది.