ICICI బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. మే 1 నుంచి ఛార్జీల మోత

ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ తన కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సర్వీసు ఛార్జీల మోత మోగించనుంది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..

ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ తన కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సర్వీసు ఛార్జీల మోత మోగించనుంది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..

నెల ఆరంభం, ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన రూల్స్‌ మారుతుంటాయి. వడ్డీ రేట్లు, సర్వీసు ఛార్జీల వంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. అంటే వాటిని పెంచడం, తగ్గించడం వంటివి అన్నమాట. తగ్గితే కస్టమర్లకు పండగే.. పెంచితేనే జేబుకు భారీగా చిల్లు పడుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే.. ప్రైవేటు బ్యాంకులు సర్వీసు ఛార్జీల మోత మోగిస్తుంటాయి. ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టాప్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు.. తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది

ఐసీఐసీఐ బ్యాంకు.. సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీల్ని సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు కీలక ప్రకటన చేసింది. ఛార్జీలు పెంచే సర్వీసుల్లో ప్రధానంగా చెక్ బుక్, ఐఎంపీఎస్‌, ఈసీఎస్‌/ఎన్‌ఏసీహెచ్‌, డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ వంటివి ఉన్నాయి. పెరిగిన ఛార్జీలు.. మే 1, 2024 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మొత్తం 17 సేవలకు సంబంధించి ఛార్జీలు పెంచినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.

ఛార్జీలు పెరగనున్న సర్వీసులు ఇవే..

  1. డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు- సిటీల్లో రూ. 200 గా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99 గా ఉంది.
  2. చెక్ బుక్స్- ఏడాదికి 25 చెక్ లీవ్స్‌కు ఎలాంటి ఛార్జీల్లేవు. ఆ తర్వాత ప్రతి లీఫ్‌కు 4 రూపాయలు చెల్లించాలి.
  3. డీడీ, పీఓ- క్యాన్సిలేషన్/డూప్లికేట్/రీవాలిడేషన్లకు సంబంధించిన రూ. 100 చొప్పున కట్టాలి.
  4. ఐఎంపీఎస్‌- అవుట్ వర్డ్- రూ. 1000 వరకు ట్రాన్సాక్షన్‌కు రూ. 2.50 చెల్లించాలి. అదే రూ. 25 వేల వరకు అయితే రూ. 5 చొప్పున చెల్లించాలి. గరిష్టంగా రూ. 5 లక్షల వరకు అయితే ప్రతి లావాదేవీకి రూ. 15 చెల్లించాల్సి వస్తుంది.
  5. అకౌంట్ క్లోజర్ ఛార్జీలు- సున్నా అంటే ఎలాంటి ఛార్జీలు లేవు.
  6. డెబిట్ కార్డ్ పిన్ జెనరేషన్ ఛార్జీలు- లేవు
  7. డెబిట్ కార్డ్ డీ-హాట్ లిస్టింగ్- లేవు
  8. బ్యాలెన్స్ సర్టిఫికెట్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్- ఛార్జీలు లేవు
  9. రిట్రైవల్ ఆఫ్ ఓల్డ్ ట్రాన్సాక్షనల్ డాక్యుమెంట్స్/ఎంక్వైరీస్ రిలేటెడ్ టు ఓల్డ్ రికార్డ్స్ – ఎలాంటి ఛార్జీలు లేవు.
  10. సిగ్నేచర్ అటెస్టేషన్- అప్లికేషన్/లెటర్‌కు రూ. 100 చెల్లించాలి.
  11. అడ్రస్ కన్ఫర్మేషన్ ఛార్జీలు- లేవు
  12. ఈసీఎస్‌/ఎన్‌ఏసీహెచ్‌డెబిట్ రిటర్న్స్- ఆర్థిక అవసరాల కోసం ఒక్కోసారి రూ. 500 చెల్లించాలి.
  13. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ మ్యాండేట్ వన్ టైమ్ మ్యాండేట్ ఆథరైజేషన్ సర్వీసు- ఛార్జీలు లేవు
  14. లియన్ మార్కింగ్ అండ్ అన్ మార్కింగ్ సేవింగ్స్ అకౌంట్- ఛార్జీలు లేవు
  15. రీఇష్యూ ఇంటర్నెట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్- ఎలాంటి ఛార్జీలు లేవు.
  16. బ్రాంచీల వద్ద అడ్రెస్‌ మార్పు సేవలు- ఎలాంటి ఛార్జీలు లేవు.
  17. స్టాప్ పేమెంట్ ఛార్జీలు- నిర్దిష్ట చెక్స్‌కు అయితే రూ. 100 ఉంటుంది.

ఈ సర్వీస్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

  1. చెక్ రిటర్న్ అవుట్ వర్డ్
  2. చెక్ రిటర్న్ ఇన్ వర్డ్
  3. డెబిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలు
  4. ఏటీఎం బ్యాలెన్స్ ఇంక్వైరీ వంటి ఛార్జీలు.
Show comments