సరికొత్త హ్యుందాయ్ అల్కాజార్ లాంచ్ అప్పుడే? కొత్త ఫీచర్స్ ఇవే!

Hyundai Alcazar: హ్యుందాయ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన అల్కాజార్ కార్ ఎంతగానో ఆకట్టుకుంది.

Hyundai Alcazar: హ్యుందాయ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన అల్కాజార్ కార్ ఎంతగానో ఆకట్టుకుంది.

కొరియన్ టాప్ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన హ్యుందాయ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఈ కంపెనీ నుంచి వచ్చిన అల్కాజార్ కార్ వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంది. హ్యుందాయ్ త్వరలో ఈ SUV కార్ ని అప్డేట్ చేసి మార్కెట్లో లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తోంది. ఈ రిఫ్రెష్ మోడల్ కొత్తగా వచ్చిన హ్యుందాయ్ క్రెటా కార్ లాగా ఉంటుందని సమాచారం తెలుస్తుంది. దీని డిజైన్ కచ్చితంగా వాహనదారులని ఆకట్టుకుంటుందట. పాత మోడల్ కంటే దీన్ని ఇంకా సరికొత్త ఫీచర్లలతో మంచి డిజైన్ తో తీసుకురావాలని కంపెనీ భావిస్తుంది. అందుకు తగ్గట్లే కంపెనీ ఇందులో మార్పులు చేసిందట. ఇక త్వరలో రాబోయే ఈ కార్ గురించి మరిన్ని వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ దీని ముందు మరియు వెనుక డిజైన్ ని స్టైల్ గా అప్డేట్ చేసిందని సమాచారం తెలుస్తుంది. దీని స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ యూనిట్‌లతో పాటు ఎల్‌ఇడి డేటైమ్ రన్నింగ్ లైట్ స్ట్రిప్‌ను అప్డేట్ చేసింది. వీటిని మనం క్రెటా కారులో చూడవచ్చు. దీని గ్రిల్ ని కూడా స్ట్రైట్ స్లాట్ లతో కొత్తగా డిజైన్‌ చేశారని తెలుస్తుంది. ఈ కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపల 10.25-అంగుళాల ట్విన్ స్క్రీన్‌ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ కార్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ ఇంకా ఆటో కార్‌ప్లేతో సహా అన్ని వైర్‌లెస్ కార్ కనెక్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుందట. ఈ కారులో వెంటిలేటెడ్ ఫ్రంట్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా అలాగే స్ట్రాంగ్ అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి అప్డేటెడ్ ఫీచర్లు ఉంటాయి.

 

ఇక త్వరలో రాబోయే ఈ అప్డేటెడ్ అల్కాజార్ కారులో అదే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ని ఉపయోగించారని తెలుస్తుంది. ఈ కార్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఇంకా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో వస్తుందని సమాచారం తెలుస్తుంది. ఈ SUV కార్ సీటింగ్ కెపాసిటీ విషయానికి వస్తే.. ఈ కార్ 6-సీటర్ ఇంకా 7-సీటర్ విభాగాల్లో వస్తుందని తెలుస్తుంది. 6 సీటర్ అయితే ప్రయాణికులకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. 7 సీటర్ అయితే థర్డ్ రోలో ప్యాసెంజర్స్ కొంచెం సర్దుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ కారుకి సంబంధించి ధర, పూర్తి వివరాలని కంపెనీ త్వరలో వెల్లడించనుంది. ఈ కార్ సెప్టెంబర్ 9న ఇండియాలో లాంచ్ అవనున్నట్లు తెలిసింది.

 

Show comments