Somesekhar
Saikesh Goud Country Chicken Co Success Story: లక్షల జీతం వదులుకుని కంట్రీ చికెన్ కో పేరిట బిజినెస్ ప్రారంభించి.. ఏడాదికి రూ.16 కోట్ల టర్నోవర్ తో దూసుకెళ్తున్న యంగ్ బిజినెస్ మెన్ సాయికేశ్ గౌడ్ విజయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Saikesh Goud Country Chicken Co Success Story: లక్షల జీతం వదులుకుని కంట్రీ చికెన్ కో పేరిట బిజినెస్ ప్రారంభించి.. ఏడాదికి రూ.16 కోట్ల టర్నోవర్ తో దూసుకెళ్తున్న యంగ్ బిజినెస్ మెన్ సాయికేశ్ గౌడ్ విజయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
సరికొత్త ఆలోచనలతో పాటుగా వాటిని ఆచరణలో పెట్టి.. ముందుకు నడిపించే సత్తా ఉంటే చాలు.. మీ ఐడియాకి కోట్లలో వర్షం కురుస్తుంది. అయితే చాలా తక్కువ మంది మాత్రమే బిజినెస్ లోకి అడుగుపెట్టాలని భావిస్తుంటారు. అనవసరంగా బిజినెస్ లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం ఎందుకు? అంటూ స్టార్ట్ చేయకుముందే నెగటీవ్ థింకింగ్ తో వెనకడుకు వేస్తుంటారు. కానీ.. ఓ యువకుడు మాత్రం వారణాసిలోని ఐఐటీలో చదువుకుని.. లక్షల ప్యాకేజీతో జీతం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ వైపుగా వెళ్లకుండా.. బిజినెస్ వైపు అడుగులు వేశాడు.. సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. అతడే.. గొడిసెల సాయికేశ్ గౌడ్. ఫ్రెండ్ తో కలిసి ‘కంట్రీ చికెన్ కో’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించి.. ఏడాదికి రూ. 16 కోట్ల టర్నోవర్ తో దూసుకెళ్తున్న ఈ యువకుడి విజయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాయికేశ్ గౌడ్.. వారణాసి ఐఐటీలో బీటెక్ చేశాడు. లక్షల ప్యాకేజీతో ఎన్నో ఉద్యోగ అవకాశాలు. కానీ.. మనకు ఇంత ఇస్తున్న సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉండటంతో.. వ్యాపారం వైపు అడుగులు వేశాడు. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ.. వాటిని కాదనుకుని ఫ్రెండ్ తో కలిసి ‘కంట్రీ చికెన్ కో’ పేరిట 2021లో వ్యాపారాన్ని ప్రారంభించాడు. పక్కా ప్రణాళికలతో వినియోగదారులకు ఎలాంటి చికెన్ కావాలో తెలుసుకుని, మార్కెట్ చిట్కాలను పసిగట్టిన సాయికేశ్.. సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నాడు. కరోనా నేర్పిన పాఠాలతో ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా పెరిగిన నాటు కోళ్లను, గుడ్లను అమ్మాలన్న ఆలోచనతో ఈ బిజినెస్ ను స్టార్ట్ చేశాడు.
“ముందు నుంచి నాకు సమాజానికి ఏమైనా చేయాలనే ఆలోచనలే ఎక్కువగా ఉండేవి. మంచి ప్యాకేజీతో జాబ్ అవకాశాలు ఉన్నప్పటికీ.. బిజినెస్ పరంగానే ముందుకెళ్లాలని అనుకునే వాడిని. అందుకే ఫ్రెండ్ తో కలిసి ‘కంట్రీ చికెన్ కో’ పేరిట నాటుకోళ్ల వ్యాపారాన్ని మెుదలుపెట్టాం. మేం డైరెక్ట్ గా రైతుల నుంచే వీటిని కోనుగోలు చేస్తాం. ఎలాంటి యాంటీ బయాటిక్స్ వాడం. కొంత మంది రైతులకు మేమే పిల్లలు ఇచ్చి.. పెంచేలా చూస్తాం. ఆ తర్వాత వాటిని కొనుగోలు చేస్తాం. అదీకాక ఓపెన్ ఏరియాల్లో కోళ్లను పెంచుతున్నాం. దాదాపు 1000 మంది రైతులతో డైరెక్ట్ గా కాంటాక్ట్ మాకుంది. వారి నుంచే కోళ్లను కొంటాం. కస్టమర్లు ఇక్కడి వచ్చి వాళ్లకు కావాల్సిన కోడిని ఎంచుకుని, ఇక్కడే ప్రాసెసింగ్ చేయించుకుని వెళ్తారు. రూ. కోటి రూపాయాల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాం” అంటూ తన విజయ ప్రస్థానం గురించి వివరించాడు సాయికేశ్.
ఇక కంట్రీ చికెన్ కో స్టార్ట్ చేసిన తొలి రెండు సంవత్సరాల్లో కస్టమర్లకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తున్నామని సాయికేశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏడాదికి రూ. 16 కోట్ల టర్నోవర్ తో వెళ్తున్న కంపెనీని వచ్చే ఏడాదికి రూ. 30 కోట్ల టర్నోవర్ కు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపాడు. దాంతో పాటుగా ఏపీ, తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా కంట్రీ చికెన్ కో ను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం 5 ఔట్ లెట్ల ద్వారా విజయవంతంగా విక్రయాలు సాగిస్తోంది కంట్రీ చికెన్ కో. ‘కంట్రీ చికెన్ కో’ పేరిట తమకంటూ ప్రత్యేక మోడల్ మార్కెట్ ను సృష్టించుకున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ విక్రయాలు కూడా సాగిస్తూ.. దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. మరి లక్షల ప్యాకేజీతో జీతం వదులుకుని నాటుకోళ్ల వ్యాపారం చేస్తూ.. ఏడాదికి రూ. 16 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న యంగ్ టెకీ గొడిసెల సాయికేశ్ గౌడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.