iDreamPost
android-app
ios-app

పోస్టాఫీస్ సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్.. వడ్డీతోనే రూ. 5 లక్షల లాభం.. ఎంత కట్టాలంటే?

Post office Time deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ లో బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. వడ్డీతోనే రూ. 5 లక్షల లాభం అందుకోవచ్చు.

Post office Time deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ లో బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. వడ్డీతోనే రూ. 5 లక్షల లాభం అందుకోవచ్చు.

పోస్టాఫీస్ సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్.. వడ్డీతోనే రూ. 5 లక్షల లాభం.. ఎంత కట్టాలంటే?

డబ్బు చేతిలో ఎంతున్నా సరే ఆశ మాత్రం చావదు. ఉన్నోడికైనా లేనోడికైనా డబ్బు ఇంకా కావాలనిపిస్తుంది. డబ్బు లేని వారు సంపాదించేందుకు ఆరాటపడుతుంటే ఉన్నవారు మత్రం దాన్ని రెట్టింపు ఎలా చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. మరి మీరు కూడా మీ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టి లాభాలను అందుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. మీరు ఒక్కసారి కడితే చాలు వడ్డీ రూపంలోనే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఆ పథకమే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్న్స్ పొందొచ్చు. ఈ పథకంలో వడ్డీతోనే రూ. 5 లక్షలు అందుకోవాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు చూద్దాం.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. వడ్డీ రూపంలో అధిక ఆదాయాన్ని పొందొచ్చు. టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్స్ ఉంటాయి. సింగిల్ అకౌంట్ తెరవొచ్చు. లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఐదేళ్ల డిపాజిట్‌పై ఆదాయపు పన్ను చట్టం- 1961, సెక్షన్ 80c కింద టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల పన్ను తగ్గించుకోవచ్చు.

ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఏడాది టైమ్ డిపాజిట్ పై 6.9 శాతం వడ్డీ, రెండేళ్ల టైమ్ డిపాజిట్లకు 7.0. శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఐదేళ్ల టైమ్ పిరియడ్ కు రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.5 శాతం వడ్డీ రేటుతో వడ్డీ రూపంలో రూ. 4,49,948 ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ నాటికి చేతికి రూ. 14,49,948 అందుతుంది. అంటే మీకు పెట్టుబడిపై వచ్చే వడ్డీతోనే దాదాపు రూ. 5 లక్షలు చేతికి అందుతుంది.