iDreamPost
android-app
ios-app

కొత్త కారు కొనాలనుకునే వారికి బంపరాఫర్? హోండా కార్లపై 88 వేల తగ్గింపు.. త్వరపడండి

కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ పలు మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఏకంగా 88 వేల వరకు పొందొచ్చు.

కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ పలు మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఏకంగా 88 వేల వరకు పొందొచ్చు.

కొత్త కారు కొనాలనుకునే వారికి బంపరాఫర్? హోండా కార్లపై 88 వేల తగ్గింపు.. త్వరపడండి

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు వ్యక్తిగత వాహనాలను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే సొంత కారు ఉంటే ఎక్కడికి వెళ్లాలన్నా సౌకర్యవంతంగా ప్రయాణించొచ్చు. ప్రైవేట్ ట్యాక్సీలను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు కార్ల తయారీ కంపెనీలు కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మార్కెట్ లో తమ సేల్స్ ను పెంచుకుని సత్తా చాటేందుకు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా తమ కంపెనీకి చెందిన పలు కార్లపై ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఏకంగా 88 వేల డిస్కౌంట్ పొందొచ్చు.

మీరు ఈ మధ్యకాలంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా? కార్లపై ఆఫర్లు ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నారా? అయితే మీలాంటి వారికి లక్కీ ఛాన్స్. న్యూ కార్ కొనుగోలు చేయాలనుకునే వారికి హోండా కంపెనీ బంపరాఫర్లను అందిస్తున్నది. జూన్ నెలలో నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి హోండా సమ్మర్‌ బొనాంజా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కింద కొత్త కారు కొనుగోలుపై రూ.88 వేల వరకు రాయితీ కల్పిస్తున్నది. అంతేకాదు ఒక జంట ప్యారిస్‌ ట్రిప్ లేదా రూ.75 వేల నగదును గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది. ఏయో కార్లపై ఆఫర్లు ప్రకటించింది అంటే?

హోంటా కంపెనీకి చెందిన హోండా ఎలివేట్‌, హోండా సిటీ, సిటీ-ఈ, హెచ్‌ఈవీ, హోండా అమేజ్‌లపై ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ మోడల్ కార్లను కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని హోండా సంస్థ తెలిపింది. ఇక డిస్కౌంట్ ఆఫ్లరు చూస్తే.. హోండా అమేజ్‌పై రూ.76 వేలు, సిటీపై రూ.88 వేలు, సిటీ ఈ:హెచ్‌ఈవీపై రూ.65 వేల వరకు, ఎలివేట్‌పై రూ. 55 వేల డిస్కౌంట్‌ను కల్పిస్తున్నది. సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే వారు హోండా అందించే డిస్కౌంట్ ఆఫర్లను వినియోగించుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. డిస్కౌంట్ ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.