ఈ ఏరియాల్లో ఇల్లు కొంటే EMI భారం తగ్గుద్ది! హోమ్ లోన్ త్వరగా క్లియర్ అవుద్ది!

Huge Benefits For Home Buyers: హోమ్ లోన్ తీసుకుంటే ఒక 20, 30 ఏళ్ల పాటు వెంటాడుతూనే ఉంటుంది. ఈఎంఐ భారం కూడా మొదట్లో ఎక్కువ ఉంటుంది. జీతం పెరిగితే తప్ప ఈఎంఐ భారం అనేది తగ్గదు. ఒకవేళ మీరు ఇల్లు కొనే ఆలోచనలో ఉంటే కనుక మీకు ఈఎంఐ భారం తగ్గుతుంది. హోమ్ లోన్ కూడా త్వరగా క్లియర్ అవుతుంది. ఎలాగో ఈ కథనం చదవండి.

Huge Benefits For Home Buyers: హోమ్ లోన్ తీసుకుంటే ఒక 20, 30 ఏళ్ల పాటు వెంటాడుతూనే ఉంటుంది. ఈఎంఐ భారం కూడా మొదట్లో ఎక్కువ ఉంటుంది. జీతం పెరిగితే తప్ప ఈఎంఐ భారం అనేది తగ్గదు. ఒకవేళ మీరు ఇల్లు కొనే ఆలోచనలో ఉంటే కనుక మీకు ఈఎంఐ భారం తగ్గుతుంది. హోమ్ లోన్ కూడా త్వరగా క్లియర్ అవుతుంది. ఎలాగో ఈ కథనం చదవండి.

డైరెక్ట్ క్యాష్ ఇచ్చి ఇల్లు కొనేంత ఆర్థిక స్థోమత ప్రస్తుతం మధ్యతరగతి వ్యక్తుల వద్ద గానీ.. నెలకు లక్షల్లో సంపాదించే ఐటీ ఉద్యోగులకు గానీ లేదు. బాగా సౌండ్ పార్టీలైతే తప్ప డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కొనరు. మిగతా వర్గాల వారంతా హోమ్ లోన్ పెట్టుకుని ఈఎంఐలో కొనుక్కోవాల్సిందే. అయితే హోమ్ లోన్ ఎక్కువ కాలం ఉండేలా ప్లాన్ చేస్తే నెల నెలా చెల్లించే ఈఎంఐ అనేది తక్కువ ఉంటుంది. అదే లోన్ పీరియడ్ తక్కువ కాలం పెట్టుకుంటే నెల నెలా చెల్లించే ఈఎంఐ అనేది ఎక్కువ ఉంటుంది. వెళ్లే కొద్దీ వడ్డీ తగ్గుతుంది.. దీంతో పాటు ఈఎంఐ తగ్గుతుంది కానీ మొదట్లోనే ఎక్కువ ఈఎంఐ అనేది ఉంటుంది. అయితే మీకు తెలుసా? హైదరాబాద్ లో ఈ ఏరియాల్లో మీరు కనుక ఇల్లు కొనుక్కుంటే మునుపటితో పోలిస్తే ఈఎంఐ భారం అనేది తగ్గుతుంది. దీంతో మీ హోమ్ లోన్ త్వరగా క్లియర్ అవుతుంది. 

హైదరాబాద్ లో ఇల్లు కొనడానికి. హోమ్ లోన్ త్వరగా క్లియర్ అవ్వడానికి ఏంటి సంబంధం? అసలు ఈఎంఐ భారం ఎలా తగ్గుతుంది? అనే కదా మీ సందేహం. దీనికి కారణం ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డల్ అవ్వడం వల్ల కొన్ని నగరంలోని ప్రధాన ఏరియాలతో సహా పలు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు తగ్గాయి. మునుపటితో పోలిస్తే 10 లక్షలు తగ్గింది. ఈ పది లక్షలకు నెలకి ఈఎంఐ ఎంత కాదన్నా ఒక 8 వేలు ఉంటుంది. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ డేటా ప్రకారం.. మీరు 30 ఏళ్ల టెన్యూర్ తో హోమ్ లోన్ తీసుకుంటే అందులో 10 లక్షలకు పడే ఈఎంఐని లెక్కగడితే నెలకు 7,867 రూపాయలు అవుతుంది. అది కూడా 8.75 వార్షిక వడ్డీతో. ఒకవేళ వడ్డీ ఎక్కువ పడితే మీ ఈఎంఐ ఎక్కువ ఉంటుంది.

మరి ఈ ఏరియాల్లో ఇళ్ల ధరల మీద 10 లక్షల వరకూ తగ్గిందంటే మీరు తీసుకునే హోమ్ లోన్ మీద ఆ పది లక్షలు తగ్గినట్టే. నెల నెలా చెల్లించే ఈఎంఐ భారం కూడా తగ్గినట్టే. ఈఎంఐ భారం తక్కువగా ఉంది కాబట్టి మీరు తక్కువ టెన్యూర్ పెట్టుకుంటే హోమ్ లోన్ త్వరగా క్లియర్ అవుతుంది. ఎక్కువ టెన్యూర్ పెట్టుకుంటే నెల నెలా చెల్లించే ఈఎంఐ భారం తగ్గుతుంది. ఎలా చూసినా కానీ మీకు బెనిఫిట్టే. బాచుపల్లి, మియాపూర్, బీరంగూడ, కూకట్ పల్లి, ఎల్బీనగర్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ఏరియాల్లో అపార్ట్మెంట్ ధరలు తగ్గాయి. కాబట్టి ఇల్లు కొనాలి అనుకునేవారికి ఇదే మంచి అవకాశం. హోమ్ లోన్ ద్వారా ఇల్లు కొనాలనుకుంటే కనుక మీరు భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి. 

Show comments