Vinay Kola
Gold: మనం బంగారం కొనేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోము. అందువల్ల కచ్చితంగా నష్టపోతాము.
Gold: మనం బంగారం కొనేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోము. అందువల్ల కచ్చితంగా నష్టపోతాము.
Vinay Kola
బంగారం అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా మన భారత మహిళలకు బంగారం అంటే ఎంతో మక్కువ. అందుకే ఇంట్లోని ప్రతి శుభకార్యానికీ కూడా నగలు ధరించాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఇక పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు మగువలు బంగారంతో మిల మిల మెరిసిపోతుంటారు. అందుకే బంగారానికి అమాంతంగా డిమాండ్ పెరిగిపోతుంది. అయితే బంగారం కొనడం వరకు ఓకే. మరి అది ప్యూర్ గోల్డ్ అని గుర్తించడం చాలా మందికి కూడా తెలీదు. బంగారంపై సరైన అవగాహన లేకుండా చాలా మంది షాపులకి వెళ్ళి మోసపోతారు. బంగారం కొనేముందు దాని ప్యూరిటీ గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని పసిడి ఆభరణాలు కొనేందుకు ఉపయోగిస్తాం. వీటిని మనం జీవితాంతం వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మనకు డబ్బులు అవసరమైనప్పుడు గోల్డ్ లోన్ తీసుకుంటాం. కొన్ని కొన్ని సార్లు మన బంగారంపై తక్కువ లోన్ వస్తుంది. ఒక్కోసారి లోన్ శాంక్షన్ కూడా కాదు. అందుకే బంగారం కొనేముందు దాని స్వచ్ఛత తెలుసుకొనే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. ఇక మనం కొనే బంగారం స్వచ్ఛమైన బంగారమా కాదా అని ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ) చట్టం ప్రకారం, బంగారు నగలపై కచ్చితంగా హాల్‌మార్కింగ్ గుర్తు ఉండాలి. హాల్‌మార్కింగ్‌లో వేరియేషన్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం కచ్చితంగా తెలుసుకోవాలి. చాలా గోల్డ్ షాపులు కూడా మనకు ప్యూర్ గోల్డ్ ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంటాయి. అలా మోసపోకుండా ఉండాలంటే కచ్చితంగా హాల్ మార్కింగ్ లో ఉన్న వేరియేషన్స్ తెలుసుకోవాలి. మీరు కొనే బంగారంపై BIS 999 అని ఉంటే అది 24 క్యారెట్స్ గోల్డ్. ఇది పూర్తిగా స్వచ్ఛమైన బంగారం. ఇక BIS 958 – 23 క్యారెట్స్, 916 – 22 క్యారెట్స్, 875 – 21 క్యారెట్స్, 750 – 18 క్యారెట్స్, 708 – 17 క్యారెట్స్, 585 – 14 క్యారెట్స్, 417 – 10 క్యారెట్స్, 375 – 9 క్యారెట్స్, 333 – 8 క్యారెట్స్ బంగారం అని అర్ధం. ఈ మార్క్స్ అన్నీ కూడా షాపులో మీరు కొనే బంగారంపై ఉంటాయి. వీటిని బట్టి బంగారం రేట్ ఉంటుంది. కానీ ఈ విషయం చాలా మందికి కూడా తెలీదు. అందువల్ల తక్కువ క్యారెట్స్ బంగారంకి కూడా 24 , 22 క్యారెట్స్ కి అవసరం అయ్యే బిల్లు కడతారు. కాబట్టి బంగారం కొనే ముందు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి.
అలాగే గోల్డ్ కొనేటప్పుడు కచ్చితంగా హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోను చెక్ చేయాలి. హాల్‌మార్కింగ్ సెంటర్స్ లిస్ట్ ని మీరు https://www.bis.gov.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, హాల్మార్క్డ్ నగల్లో బీఐఎస్ లోగో, ప్యూరిటీ/ ఫిట్నెస్ గ్రేడ్, ఆల్ఫాన్యూమెరిక్ కోడ్ ( HUID) కచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే నిజమైన బంగారం అని అర్ధం. బంగారాన్ని కొన్నాక కచ్చితంగా క్యాష్ మెమోను అడిగి తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు ఏదైనా సమస్య వచ్చి, కంప్లైంట్ చేయాల్సి వస్తే ఈ క్యాష్ మెమో మీకు ఉపయోగపడుతుంది. ఇదీ సంగతి. కాబట్టి కచ్చితంగా గోల్డ్ కొనే ముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.