ఆ ఉద్యోగులకు దీపావళి బోనస్.. అకౌంట్ లో ఎంత పడుతుందంటే?

దీపావళి వస్తుందంటే చాలు చిరుద్యోగుల దగ్గర్నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీతంతో పాటు బోనస్ ను కూడా అందుకుని దీపావళి పండుగను రెట్టిపు ఆనందంతో జరుపుకునేందుకు సిద్ధమవుతుంటారు.

దీపావళి వస్తుందంటే చాలు చిరుద్యోగుల దగ్గర్నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీతంతో పాటు బోనస్ ను కూడా అందుకుని దీపావళి పండుగను రెట్టిపు ఆనందంతో జరుపుకునేందుకు సిద్ధమవుతుంటారు.

దేశ వ్యాప్తంగా ఇంకో పది రోజుల్లో దీపావళి పండగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు బోనస్ కోసం ఎదురుచూస్తుంటారు. బోనస్ అకౌంట్లో ఎంత పడుతుందో అని ఆలోచిస్తుంటారు. ఇందుకు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు బోనస్ అందించడానికి సన్నద్ధమవుతుంటాయి. సంస్థల అభివృద్ధిలో పాలు పంచుకున్న ఉద్యోగుల జీవితాల్లో ఆనందం నింపే విధంగా బోనస్ లు ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో అసలు కంపెనీలు ఉద్యోగస్థులకు ఎంత బోనస్ అందిస్తాయి? ఏ ప్రకారంగా బోనస్ ను లెక్కగడతాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

దీపావళి వస్తుందంటే చాలు చిరుద్యోగుల దగ్గర్నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీతంతో పాటు బోనస్ ను కూడా అందుకుని దీపావళి పండుగను రెట్టిపు ఆనందంతో జరుపుకునేందుకు సిద్ధమవుతుంటారు. దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు ఈ ఆనందకరమైన క్షణాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఈ దీపావళికి పలు రంగాలకు చెందిన ఉద్యోగులు తమ నెలవారీ జీతంలో 20 శాతం వరకు బోనస్ అందుకోవచ్చని హెచ్‌ఆర్ మరియు రిక్రూటింగ్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. స్టాఫింగ్ సంస్థ సీఐఈఎల్ హెచ్ ఆర్ మాన్యూఫ్యాక్చరింగ్ సెక్టార్ లోని దాదాపు 160 కంపెనీల మధ్య బోనస్ కు సంబంధించిన సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఏం తేలిందంటే?

సర్వే ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ రంగంలోని 160 కంపెనీల్లో 90 కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పింది. అయితే తయారీ కంపెనీలు చెల్లించే దీపావళి బోనస్ మొత్తం రూ.7000 నుంచి రూ.10,000 మధ్య ఉంటుందని సీఐఈఎల్ హెచ్‌ఆర్ డైరెక్టర్ సంతోష్ నాయర్ తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి దీపావళి బోనస్ ఇవ్వాలనే ఖఛ్చితమైన రూల్ ఏం లేదు. కాగా కంపెనీలు లాభాల బాట పట్టినప్పుడు దానికి కారణమైన ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలంగా బోనస్ లు అందిస్తుంటాయి.

Show comments