Vinay Kola
Bank: సైబర్ మోసగాళ్ళు జనాలను చాలా దారుణంగా మోసం చేస్తున్నారు. భారీగా డబ్బులు దోచుకుంటున్నారు.
Bank: సైబర్ మోసగాళ్ళు జనాలను చాలా దారుణంగా మోసం చేస్తున్నారు. భారీగా డబ్బులు దోచుకుంటున్నారు.
Vinay Kola
అనేక రకాల కారణాలతో, లోన్ యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులని దారుణంగా మోసం చేస్తున్నారు. వీరిలో చదువుకున్న వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు. ముఖ్యంగా లోన్ యాప్‌ల ను ఇన్‌స్టాల్ చేసుకోవడంతో ఫోన్లలో ఉండే పర్సనల్ డేటా సైబర్ నేరస్థులకు దొరుకుతుంది. వీళ్ళు ఎలాంటి డాక్యుమెంట్‌లు లేకుండా లోన్స్ ఇస్తారు, కానీ తర్వాత బాధితుల ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. బాగా వేధిస్తారు. ఇలా చాలా మంది కూడా వేధింపులకు తట్టుకోలేక చనిపోతున్నారు కూడా. వీళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకుంటే బాధితుల మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామని భయపెడతారు. లేదా వాళ్ల పరిచయస్తులకి పంపుతామని బెదిరింపులు చేస్తారు. వారి బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయి బాధితులు వేలు, లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటారు.
కొంతమంది అయితే అవమానంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు బాగా పెరిగిపోయాయి. దాంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. లోన్ యాప్ లో లోన్లు తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులను వివరిస్తున్నారు. ఒక్క లోన్ యాప్స్ అనే కాదు చాలా రకాలుగా సైబర్ మోసగాళ్ళు జనాలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్‌కు మూడు షాకింగ్ మెసేజ్ లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి.. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల డబ్బు వేరే బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయినట్లుగా బ్యాంక్ నుంచి మేసేజ్ వచ్చింది.
వెంటనే హర్ష గుండె ఆగినంత పనైంది. తన ప్రమేయం లేకుండా ఇంత డబ్బు ట్రాన్స్ఫర్ కావటంతో బాగా కంగారు పడ్డాడు. ఆ వెంటనే అతను అలర్ట్ అయ్యాడు. కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారులకి ఈ విషయం చెప్పాడు. తరువాత వెంటనే 1930 నెంబరుకు ఫోన్ చేసి తనకు జరిగిన మోసం గురించి చెప్పాడు. వెంటనే స్పందించిన సెంట్రల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టం టీంని యాక్షన్ లోకి దించింది. తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో యాక్షన్ లోకి దిగింది. ఇదీ సంగతి. కాబట్టి బ్యాంకులలో ఎక్కువ డబ్బు దాచుకునే వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్ లో 1930 నెంబర్ ని కచ్చితంగా సేవ్ చేసుకోండి. ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.