iDreamPost
android-app
ios-app

Hero నుంచి స్ప్లెండర్ ఎక్స్ టెక్ 2.O లాంచ్! తక్కువ ధరతో అదిరే ఫీచర్లు!

  • Published Sep 12, 2024 | 3:00 AM Updated Updated Sep 12, 2024 | 3:00 AM

Hero Splendor Xtec 2.O: స్ప్లెండర్ ఎక్స్ టెక్ 2.o ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. స్ప్లెండర్ బైక్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియన్ మార్కెట్లో చలామణి అవుతుంది.

Hero Splendor Xtec 2.O: స్ప్లెండర్ ఎక్స్ టెక్ 2.o ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. స్ప్లెండర్ బైక్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియన్ మార్కెట్లో చలామణి అవుతుంది.

  • Published Sep 12, 2024 | 3:00 AMUpdated Sep 12, 2024 | 3:00 AM
Hero నుంచి స్ప్లెండర్ ఎక్స్ టెక్  2.O లాంచ్! తక్కువ ధరతో అదిరే ఫీచర్లు!

ఇండియాలో మధ్య తరగతి వినియోగాదారులు ఎక్కువగా ఇష్టపడే బైక్ హీరో స్ప్లెండర్. ఈ బైక్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియన్ మార్కెట్లో చలామణి అవుతుంది. ఎన్ని బైక్స్ వచ్చినా కానీ ఈ బైక్ క్రేజ్ మాత్రం తగ్గదు. తాజాగా స్ప్లెండర్ ఎక్స్ టెక్ 2.o ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. చూడ్డానికి ఎంతో స్టైలిష్ గా ఉండే ఈ బైక్ ఫీచర్స్, ధర ఇంకా పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్ప్లెండర్ ఎక్స్ టెక్ 2.o బైక్ డిఫరెంట్ గా డిజైన్ చేయబడింది. ఈ బైక్ లో కొత్త ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది. అలాగే ఇంటెన్సిటీ పొజిషన్ లాంప్ వస్తుంది. వీటితో రోడ్ పై వెళుతుంటే చాలా మంచి అనుభూతి వస్తుంది. ఇంకా ఇందులో ఫుల్లీ డిజిటల్ స్పీడో మీటర్, పొడవైన సీటు, పెద్ద గ్లోవ్ బాక్స్ ఇంకా అలాగే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ వంటి సూపర్ ఫీచర్స్ ఉన్నాయి.

ఇక ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే.. చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని తెలుస్తుంది. పాత మోడల్ ఇంజిన్ కంటే మెరుగ్గా ఈ ఇంజిన్ అనేది ఉంటుంది. ఈ బైక్ 100 సీసి సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 7.9 BHP పవర్ కలిగి ఉంటుంది. అలాగే 8.05 Nm టార్క్ కలిగి ఉంటుంది. అందువల్ల ఈ బైక్ మంచి పెర్ఫార్మన్స్ ని ఇస్తుంది. ఇంకా అలాగే ఈ బైక్ లో కొత్తగా i3S టెక్నాలజీని యాడ్ చేశారు. అందువల్ల ఈ బైక్ అదిరిపోయే రేంజిలో గంటకు ఏకంగా 75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక ఈ బైక్ ధర విషయానికి వస్తే హీరో కంపెనీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర 70 వేల రూపాయల నుంచి 83 వేల దాకా ఉంటుంది. బడ్జెట్ ధరలో మంచి బైక్ కొనాలనుకునేవారికి ఈ బైక్ మంచి ఆప్షన్. ఈ బైక్ పై మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక ఈ సరికొత్త హీరో స్ప్లెండర్ ఎక్స్ టెక్ 2.o పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetHoliganbetCasibomHoliganbetHoliganbetcasibomjojobet günceldeneme bonusu veren sitelerMadridbetMadridbetMadridbetJojobetjojobetJojobetcasibomjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobetbetcio