మైలేజీలో రారాజు ఈ కొత్త స్ప్లెండర్‌ ప్లస్‌ బైక్.. లీటర్‌కు ఏకంగా 73 కి.మీ.

మంచి మైలేజీ ఇచ్చే బైక్ కోసం ఎదురుచూస్తున్నారా? తక్కువ ధరలోనే స్ప్లెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్‌ 2.0 బైక్‌ అందుబాటులోకి వచ్చింది. లీటర్ కు ఏకంగా 73కి.మీల మైలేజీని ఇవ్వనుంది.

మంచి మైలేజీ ఇచ్చే బైక్ కోసం ఎదురుచూస్తున్నారా? తక్కువ ధరలోనే స్ప్లెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్‌ 2.0 బైక్‌ అందుబాటులోకి వచ్చింది. లీటర్ కు ఏకంగా 73కి.మీల మైలేజీని ఇవ్వనుంది.

మార్కెట్ లో హీరో స్ప్లెండర్ బైక్‌లకు ఉండే క్రేజే వేరు. నిత్యం వందలాది కొత్త బైక్ లు సేల్ అవుతూ ఉంటాయి. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో హీరో స్ప్లెండర్ బైక్‌లకి ఆదరణ ఎక్కువ. చిరుద్యోగులు, వృత్తి పనుల వారు ఈ స్ప్లెండర్ బైక్‌లనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే మైలేజీ పరంగా చూసుకుంటే ఇంత తక్కువ ధరలో దీన్ని మించిన టూవీలర్ లేదు. ఇక ఇటీవల ఆధునిక టెక్నాలజీతో, స్మార్ట్ ఫీచర్లతో హీరో కంపెనీ సరికొత్త స్ప్లెండర్ బైక్‌లను రూపొందిస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నది. తాజాగా స్ప్లెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్‌ 2.0 బైక్‌ని ఆ సంస్థ విడుదల చేసింది.

ఈ మధ్యకాలంలో స్ప్లెండర్ బైక్ లను కొనాలనే ప్లాన్ లో ఉన్నవారికి గుడ్ న్యూస్. లేటెస్ట్ ఫీచర్లతో కొత్త స్ప్లెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్‌ 2.0 బైక్‌ అందుబాటులోకి వచ్చింది. మంచి మైలేజీ ఇచ్చే బైక్ కోసం చూసే వారికి ఈ బైక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. న్యూ స్ప్లెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్‌ 2.0 బైక్‌ ధర రూ.82,911 (ఎక్స్‌షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ లీటర్ కు 73కీ.మీల మైలేజీని ఇవ్వనుంది. ఇంత తక్కువ ధరలో 73 కి.మీల మైలేజీ బైక్ వస్తుండడంతో వాహనదారుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ రానున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. హోండా షైన్ 100 సీసీ బైక్ కు న్యూ స్ప్లెండర్ ప్లస్ బైక్ గట్టి పోటీ ఇవ్వనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

కొత్త హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్‌ 2.0లో 100 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ 7.09 బీహెచ్పీ వద్ద 8.05ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు ఉన్నాయి. డ్రమ్ బ్రేకులను అందించారు. ఈ కొత్త బైక్‌లో అధునాతన ఫీచర్లతో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్‌ ఉంది. హీరో స్ప్లెండర్‌ ప్లస్ ఎక్స్‌టెక్‌ మెరుగైన సేఫ్టీని అందించడానికి హజార్డ్ లైట్లతో వస్తుంది. ఈ బైక్ ఇంజిన్ ఐ3ఎస్ టెక్నాలజీతో వస్తుంది. ఎకో ఇండికేటర్, రియల్ టైమ్ మైలేజీ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్‌లను డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌ కన్సోల్‌లో చూపిస్తుంది. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు స్ప్లెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్‌ 2.0 బైక్‌ లో ఉన్నాయి.

Show comments