Hero karizma ce001 special edition: వేలంలో హీరో బైక్.. 100 మందికి మాత్రమే.. కారణం ఏంటంటే?

వేలంలో హీరో బైక్.. 100 మందికి మాత్రమే.. కారణం ఏంటంటే?

Hero karizma ce001 special edition: హీరో బైకులకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన ఓ బైక్ ను వేలం వేయనున్నారు. కేవలం 100 బైకులను మాత్రమే విక్రయించనున్నారు.

Hero karizma ce001 special edition: హీరో బైకులకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన ఓ బైక్ ను వేలం వేయనున్నారు. కేవలం 100 బైకులను మాత్రమే విక్రయించనున్నారు.

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో బైక్ లకు మార్కెట్ లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే బైక్ లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. హీరో బైక్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. బడ్జెట్ ధరల్లోనే లభ్యమవ్వడం, మంచి మైలేజీ ఇవ్వడంతో హీరో బైక్ లకు ఆదరణ ఎక్కువ. నిత్యం వందల సంఖ్యలో హీరో బైక్స్ అమ్ముడవుతుంటాయి. అయితే తాజాగా హీరో కంపెనీ తన సెంటెనియల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ విక్రయాలను ప్రకటించింది. అయితే ఈ బైక్ లను 100 మందికి మాత్రమే విక్రయించనున్నది. అది కూడా వేలంలోనే. దీనికి గల కారణం ఏంటంటే?

హీరో మోటోకార్ప్ ది సెంటెనియల్ కలెక్టర్స్ ఎడిషన్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. హీరో మోటోకార్ప్ ఫౌండర్ డాక్టర్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ 101వ పుట్టినరోజు సందర్బంగా కంపెనీ సెంటెనియల్ ఎడిషన్ బైకును వేలం చేయనున్నది. ఈ బైక్‌ను తమ ‘ఉద్యోగులు, సహచరులు, వ్యాపార భాగస్వాములు, వాటాదారుల’ కోసం ప్రత్యేకంగా వేలం వేయనున్నట్లు హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సమాజం మేలు కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. కేవలం 100 బైకులను మాత్రమే విక్రయించనున్నారు. అంటే 100 మందికి మాత్రమే ఈ బైక్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. వేలంలో కాబట్టి భారీ ధర పలికే అవకాశం ఉంది.

అయితే కంపెనీ వేలం ధరలను ప్రకటించలేదు. సెంటెనియల్ ఎడిషన్ బైకు డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన పాపులర్ మోటార్ బైకులలో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ ఒకటి. హీరో సెంటెనియల్ ఎడిషన్ అనేది కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కార్బన్ ఫైబర్ బాడీవర్క్, సింగిల్ సీట్, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ మఫ్లర్‌ వంటి వాటిని పొందుతుంది.

Show comments