మీ ఆధార్ ఎవరెవరికి ఇచ్చారు? ఒక్క క్లిక్ తో హిస్టరీ చెక్ చేసుకోండి..

How To Check Aadhaar Authentication History: ఆధార్ కార్డులు వాడే వాళ్లు అందరూ కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. మన ఆధార్ కార్డుని ఎక్కడ వాడాం? ఎందుకు వాడాం? అనే విషయాలపై అవగాహన ఉండాలి.

How To Check Aadhaar Authentication History: ఆధార్ కార్డులు వాడే వాళ్లు అందరూ కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. మన ఆధార్ కార్డుని ఎక్కడ వాడాం? ఎందుకు వాడాం? అనే విషయాలపై అవగాహన ఉండాలి.

భారతీయులకు ఆధార్ తప్పనిసరి అని అందరికీ తెలిసిందే. మొదట్లో దీనిని కేవలం గుర్తింపు కార్డుగా తీసుకొచ్చారు. ఆ తర్వతా ప్రతి విషయానికి ఆధార్ ని తప్పనిసరి చేసేశారు. సిమ్ కార్డు తీసుకోవాలన్నా, అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా, అడ్రస్ ప్రూఫ్ గా ఇలా ప్రతి విషయానికి ఆధార్ ని తప్పనిసరి చేశారు. ఆ తర్వాత సైబర్ క్రైమ్స్ కూడా అలాగే పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డు మీద వందల్లో సిమ్స్ తీసుకోవడం, తెలియని అకౌంట్స్ ఓపెన్ చేయడం కూడా చేస్తున్నారు. మనకి తెలియకుండా మన ఆధార్ కార్డు మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్స్ ని కూడా తీసుకుంటున్నారు. అందుకే ఒకసారి మీరు మీ ఆధార్ కార్డు హిస్టరీని చెక్ చేసుకోవడం మంచిది అంటున్నారు.

2010లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తీసుకొచ్చింది. ఆ తర్వాత అది భారతీయులకు ఒక అత్యవసరమైన, తప్పనిసరి గుర్తింపు కార్డుగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాల మొదలు బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు, ముఖ్యమైన ఏ పనికైనా ఆధార్ కార్డుని తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ ఫ్రాడ్ చేసేవాళ్లు, సంక్షేమ పథకాలను దొంగతనంగా దోచుకోవాలి అనుకునేవాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. చాలామంది ఆధార్ కార్డు హిస్టరీ గురించి కూడా తెలియకుండా ఉండిపోతున్నారు. అందుకే ఒకసారి మీ ఆధార్ కార్డు హిస్టరీని చెక్ చేసుకుంటే మంచిది. అయితే ఆధార్ హిస్టరీని ఎలా చెక్ చేసుకోవాలో చూడండి.

హిస్టరీని ఇలా చెక్ చేసుకోండి:

  • మొదట మీరు ఆధార్ అధికారిక వెబ్ సైట్ యూఐడీఏఐ వెబ్ సైట్ ని సందర్శంచాల్సి ఉంటుంది.
  • యూఐడీఏఐ వెబ్ సైట్ లో ఎడమవైపు మై ఆధార్ అనే ఆప్షన్ లో ఉండే ఆధార్ సర్వీసెస్ ని క్లిక్ చేయాలి.
  • కిందకు స్క్రోల్ చేశాక ఆధార్ అథెంటికషన్ హిస్టరీ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత మిమ్మల్ని ఒక కొత్త పేజ్ లోకి రీడైరెక్ట్ చేస్తుంది.
  • కొత్త పేజ్ లో లాగిన్ అయ్యేందుకు ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, ఓటీపీ నంబర్ తో లాగిన్ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత కిందకు స్క్రోల్ చేసిన తర్వాత అథెంటికేషన్ హిస్టరీ కనిపిస్తుంది.
  • అథంటికేషన్ హిస్టరీలో ఆల్ మీద క్లిక్ చేసి డేట్ సెలక్ట్ చేసుకుని ఫెట్చ్ అథెంటికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వతా మీరు మీ ఆధార్ అథెంటికేషన్, ఓటీపీ, డెమోగ్రాఫిక్, బయోగ్రాఫిక్ తో ఆధార్ ని లాస్ట్ సిక్స్ మంథ్స్ లో ఎక్కడెక్కడ వాడారో వివరాలు వస్తాయి.
Show comments