Keerthi
మహిళలు వ్యాపారాన్ని సులభంగా, సొంతంగా ప్రారంభించడానికి రుణం చాలా అవసరం. దీని కోసం ప్రభుత్వం తరుపున చాలా స్కీమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఆర్థికంగా మరింత వెనుకబడిన మహిళ గురించి తాజాగా HDFC బ్యాంకు చిన్నపాటి రుణాలను అందించడానికి ముందుకు వచ్చింది.
మహిళలు వ్యాపారాన్ని సులభంగా, సొంతంగా ప్రారంభించడానికి రుణం చాలా అవసరం. దీని కోసం ప్రభుత్వం తరుపున చాలా స్కీమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఆర్థికంగా మరింత వెనుకబడిన మహిళ గురించి తాజాగా HDFC బ్యాంకు చిన్నపాటి రుణాలను అందించడానికి ముందుకు వచ్చింది.
Keerthi
దేశంలోని ప్రతిఒక్క మహిళ ఆర్థికంగా ఎదిగి సొంతగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి రుణాలు చాలా అవసరం. అందుకోసం ప్రస్తుత కాలంలో మహిళలు గురించి రకరకాల స్కీమ్స్ వాటితో పాటు రుణాలు కూడా చాలానే అందుబాటులో ఉన‍్నాయి. దీంతో చాలామంది మహిళలు ఇప్పుడు సులభంగా, సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా మహిళలు సులభంగా రుణాలు పొందడానికి HDFC బ్యాంక్ చిన్నపాటి రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
మహిళలు వ్యాపారాన్ని సులభంగా సొంతంగా ప్రారంభించడానికి రుణం చాలా అవసరం. దీని కోసం ప్రభుత్వం తరుపున చాలా స్కీమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఆర్థికంగా మరింత వెనుకబడిన మహిళ గురించి తాజాగా HDFC బ్యాంకు చిన్నపాటి రుణాలను అందించడానికి ముందుకు వచ్చింది. అందుకోసం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (IFC) నుంచి 500 మిలియన్ డాలర్ల నిధిని పొందింది. అయితే ఈ రుణాలు అనేవి.. మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జి) , జాయింట్ లయబిలిటీ గ్రూపులకు (జెఎల్‌జి) చిన్న రుణాలు ఇవ్వడానికి ఈ బ్యాంకు ఆ డబ్బును ఉపాయోగిస్తుంది. ఇక మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ గ్రూపులను నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా భారతదేశంలోని మహిళలకు చిన్న రుణాలు ఇవ్వడంలో మరింత చురుకుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 2023 నాటికి.. ఈ కంపెనీలు దాదాపు 47 మిలియన్ల మహిళలకు 31.6 బిలియన్ డాలర్ల విలువైన రుణాలు ఇచ్చాయి. కనుక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకుల సహాయంతో, మహిళలు సులభంగా ఈ రుణాలు పొందగలుగుతారు. అయితే తాజాగా నేడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు కూడా పెరుగుదల కనిపిస్తుంది. కాగా, ప్రస్తుతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు రూ. 1,465.40 స్థాయిలో పెరుగుదలతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే గత 5 రోజుల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు రెండు శాతానికి పైగా పెరిగాయి. ఇక దీనికి ముందు బ్యాంకు షేర్లలో క్షీణత కనిపించింది. మరి, ప్రస్తుతం డ్వాక్రా మహిళలకు HDFC బ్యాంక్ రుణాలు అందిస్తుడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.