UPI యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై రోజుకు రూ. లక్ష..

Good News for UPI Users: చేతిలో స్మార్ట్, ఇంటర్నెట్ ఉంటే చాలు జేబులో డబ్బులు అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది. దేశంలో కొంత కాలంగా యూపీఐ పేమెంట్స్ సర్వీసులు ఎంతగా సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు చిన్న చిన్న టీ దుకాణాల నుంచి మొదలు పెడితే.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.

Good News for UPI Users: చేతిలో స్మార్ట్, ఇంటర్నెట్ ఉంటే చాలు జేబులో డబ్బులు అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది. దేశంలో కొంత కాలంగా యూపీఐ పేమెంట్స్ సర్వీసులు ఎంతగా సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు చిన్న చిన్న టీ దుకాణాల నుంచి మొదలు పెడితే.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.

ఇటీవల దేశ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ సర్వీసులు ఎంతగా సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. యూపీఐ సేవల కారణంగా దేశంలో ఆన్‌లైన్ పేమెంట్స్ భారీగా పెరిగిపోయాయి. చేతిలో స్మార్ట్, ఇంటర్నెట్ ఉంటే చాలు జేబులో డబ్బులు అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది. చిన్న చిన్న టీ దుకాణాల నుంచి మొదలు పెడితే.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు కస్టమర్లు. యూపీఐ సేవలను ఉపయోగిస్తున్న NRI ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఎన్ఆర్ఐ లు తమ కుటుంబ సభ్యులకు యూపీఐ ద్వారా రోజూ ఒక లక్ష రూపాయల వరకు పంపించుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్ (NRE), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ(NRO) ఖాతాలు ఏన్న ఎన్ఆర్ఐ లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ద్వారా ఇకపై రోజుకు రూ.1 లక్ష రూపాయల వరకు చెల్లించుకోవచ్చు. సదరు యూజర్లు భారత్ లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు, ఇతర చెల్లింపులకు నగదు పంపించుకోవచ్చు.

అంతర్జాతీయ మొబైల్ నెంబర్ ను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ ద్వారా ఉచిత లావాదేవీల కోసం యూపీఐ ఉపయోగించుకునే సదుపాయం కల్పించారు. ప్రస్తుతం ఈ సదుపాయం యూఎస్, యూకే, సింగపూర్, యూఏఈ, కెనెడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మలేషియా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారలైకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించబడింది. ఈ కొత్త సౌకర్యంతో భారత్ ఉన్న తమ కుటుంబ సభ్యులు ఎక్కువ డబ్బు పంపించుకునే సదుపాయం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అంటున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కెమెరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఈక్విటా స్మాల్ పఐనాన్స్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంకులు ఈ అవకాశాన్ని కల్పించాయి.

సాధారణంగా ఎక్కడైనా అంతర్జాతీయ సెల్ ఫోన్ నెంబర్లకు ఫోన్ పే, పేటీఎం, బీమ్, గూగుల్ పే, బీమ్ ఏయూ, ఫెడ్ మొబైల్, బీమ్ ఇండస్ పే, ఎస్‌బీఐ మిర్రర్ ప్లస్, ఐమొబైల్ వంటి పేమెంట్స్ యాప్స్ సపోర్ట్ చేస్తుంటాయి. ఇక ఎన్ఆర్ఐ లు తమ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ వో ఖాతాల మధ్య అదే విధంగా దేశంలోని ఖాతాలకు యూపీఐ లావాదేవీలు చేసుకునే సదావకాశం కల్పించబడింది. ఎన్ఆర్ఓ ఖాతా నుంచి ఎన్ఆర్ఈ ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌వర్ చేసుకోవచ్చు. కొత్తగా తీసుకు వచ్చిన ఈ సదుపాయం వల్ల ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంతో మేలు కలుగుతుందని కస్టమర్లు అంటున్నారు. మరి లేటెస్ట్ గా తీసుకువచ్చిన యూపీఐ సదుపాయం గురించి మీరు ఎమాంటరో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments