Krishna Kowshik
ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి ఊర్లు ఏలాలా అనే మాటలను ఆయుధంగా మలుచుకుని.. అవే చేస్తూ.. కుటుంబానికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తున్నారు మహిళలు. ముఖ్యంగా రిస్క్ అయినా సరే వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరికి ఆర్థిక సాయాన్నిచ్చి అండగా నిలుస్తుంది కేంద్ర ప్రభుత్వం..
ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి ఊర్లు ఏలాలా అనే మాటలను ఆయుధంగా మలుచుకుని.. అవే చేస్తూ.. కుటుంబానికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తున్నారు మహిళలు. ముఖ్యంగా రిస్క్ అయినా సరే వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరికి ఆర్థిక సాయాన్నిచ్చి అండగా నిలుస్తుంది కేంద్ర ప్రభుత్వం..
Krishna Kowshik
తాము ఎందులోనూ తీసిపోవడం లేదని నిరూపిస్తున్నారు మహిళలు. ఇంటిని చక్కబెట్టడంలోనే కాదూ ఆర్థికంగా కూడా అండగా నిలుస్తున్నారు. ఇటు పిల్లల బాధ్యతలు చూస్తూనే.. సంపాదిస్తూ.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఉద్యోగాలే కాదూ వ్యాపారాలు చేస్తూ.. భర్తకు వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. బిజినెస్ ఉమెన్స్‌గా పేరొందారు చాలా మంది మహిళలు. అటువంటి ఆశాహహులైన మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం కూడా చేస్తోంది. అవే ముద్రా లోన్స్. కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకున్న ఎవరైనా లోన్లను పొందవచ్చు. అయితే ఇప్పుడు ఈ లోన్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
ఇకపై ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద అందించే రుణాలకు సంబంధించి.. మహిళలకు తొలి ప్రాధాన్యం ఉంటుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పీఎం స్వనిధి స్కీమ్ కింద లబ్దిదారులకు రుణ మంజూరు పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ కీలక ప్రకటన చేశారు. వీధి వ్యాపారులు ఇంకా ఎవరైనా ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందలేకపోయినట్లయితే.. అలాంటి వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. అటువంటి వారికి పీఎం స్వనిధి స్కీమ్ ప్రయోజనం అందేలా చూడాలని సూచించారు. అయితే ఇకపై స్వనిధి స్కీమ్ కింద రుణాలను తీసుకున్నట్లయితే మహిళలకు మొదట ప్రియారిటీ ఉండనుంది. ఈ స్కీమ్‌లో స్వనిధి సే సమృద్ధి కూడా ఓ భాగమేనని నిర్మలా తెలిపారు.
ఈ స్కీం ద్వారా 8 రకాల ప్రభుత్వ పథకాలు లబ్దిదారుల కుటుంబాలకు లభిస్తాయని వెల్లడించారు. జన్ ధన్, ఆధార్, మొబైల్ నంబర్ ద్వారా ఈజీగా ఈ సేవలు పొందవచ్చునని ఆమె పేర్కొన్నారు. ఆధార్ కార్డు ఉన్న వారు నేరుగా బ్యాంక్‌కు వెళ్లి.. జన్ ధన్ ఖాతా తెరవొచ్చునని సూచించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు.. నేరుగా ఈ ఖాతాల్లోనే పడతాయన్నారు. పీఎం స్వనిధి పథకం ద్వారా లబ్దిదారులకు కేటగిరి ఆధారంగా లోన్ మంజూరు అవుతుంది. చిరు వ్యాపారులకు సంబంధించి శిశు కేటగిరి కింద రూ. 50 వేల వరకు రుణం అందిస్తారు. కిషోర్ కేటగిరి కింద రూ. 50 వేలు నుండి రూ. 5 లక్షల వరకు , ఇక తరుణ్ కేటగిరి కింద రూ. 5 లక్షల నుండి రూ . 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు. పీఎం స్వనిధి స్కీం కింద విడతల వారీగా అందిస్తారు. తొలిగా 10 వేల రూపాయలు, ఆ తర్వాత రూ. 20 వేలు, వాటిని సరైన సమయంలో చెల్లించిన వారికీ రూ. 50 వేలు రుణాన్ని ఇస్తారు. మరి రుణాల విషయంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.