JIO యూజర్స్ కు గుడ్ న్యూస్.. రూ.173కే అన్‌లిమిటెడ్ కాల్స్- డేటా

Reliance Jio: ప్రస్తుతం లక్షలమంది యూజర్స్ BSNL నెట్ వర్క్ కు పోర్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన జియో, బీఎస్ఎన్ఎల్‌ యాన్యువల్ ప్లాన్‌ను పోలి ఉన్న అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. అదేంటో చూద్దాం.

Reliance Jio: ప్రస్తుతం లక్షలమంది యూజర్స్ BSNL నెట్ వర్క్ కు పోర్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన జియో, బీఎస్ఎన్ఎల్‌ యాన్యువల్ ప్లాన్‌ను పోలి ఉన్న అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. అదేంటో చూద్దాం.

దేశంలో ప్రముఖ టెలికాం రంగంలో దూసుకుపోతున్న అతి పెద్ద నెట్ వర్క్ లో రిలయాన్స్ జియో కూడా ఒకటి. అయితే ఈ రిలయన్స్ జియో వచ్చిరావడంతోనే సంచలన నిర్ణయాలకు కేరాఫ్ గా నిలిచింది. ఎందుకంటే.. సరసమైన ధరలకే అపరిమిత అన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎఎష్, డేటా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూ సంచలనం సృష్టించింది. దీంతో మార్కెట్ లో జియోకు సాటి ఏదీ లేకుండా నిలిచింది. ఇలా మొన్న మొన్నటి వరకు కస్టమర్స్ ను ఆకట్టుకున్న విధంగా అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించిన జియో.. ఉన్నట్టుండి రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. ఇక జియో బాటలనే ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి రీఛార్జ్ ధరలను పెంచేశాయి. అయితే భారీ ధరలు పెంపుతో కస్టమర్లు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.

దీంతో ప్రత్యాన్మాయంగా చౌకైన ధరలకు అందించే నెట్ వర్క్ కోసం మారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆకర్షించే రీఛార్జ్ ధరలు ప్రకటించడంతో.. అందరూ ఈ నెట్ వర్క్ పై మారేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే.. BSNL కూడా వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం, అలాగే యూజర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసం.. నిరంతరం ప్రయత్నిస్తోంది. కాగా,ఇప్పటికే లక్షలమంది యూజర్స్ BSNL నెట్ వర్క్ కు పోర్ట్ అయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అప్రమత్తమైన జియో, బీఎస్ఎన్ఎల్‌ యాన్యువల్ ప్లాన్‌ను పోలి ఉన్న అచ్చం అలాంటి రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అయితే కొంతకాలం కిందట.. మొత్తం డేటా ప్లాన్లే తప్ప, వాల్యూ యాడెడ్ ప్లాన్స్ కరువయ్యాయి. దీంతో జియో తాజాగా అలాంటి ప్లాన్స్ ను తీసుకొచ్చింది. మరీ, ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

తాజాగా రిలయన్స్  జియో 336 రోజుల వ్యాలిడిటీతో.. రూ.1899 ధరకు ఓ కొత్త ప్లాన్ ను ఆవిష్కరించింది. అయితే ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా 3600 ఫ్రీ ఎస్ఎంఎస్‌లు, ఫ్రీ నేషనల్ రోమింగ్, ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఇలా అన్నీ ఆఫర్ తో కలిపి మొత్తంగా 24 GB డేటాతో ప్లాన్ తెచ్చింది.  అదే నెలవారీగా చూసుకుంటే.. రూ.173 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ఇదిలా ఉంటే..  డేటా అవసరం ఉన్న వాళ్లకు నెలవారీ ప్లాన్లు కనీసం రూ.200 పైనే ఉన్నాయని చెప్పొచ్చు. అది కూడా 28 రోజులు, 24 రోజులు, 18 రోజులు అని కాలపరిమితి తగ్గుకుంటూ ధరలు పెరిగిపోతున్నాయి.

కానీ, ఇక్కడ వైఫై ఉన్నవారు, డేటా అవసరం ఎక్కువగా లేని వారు కూడా  కచ్చితంగా డైలీ 1GB, 2GB డేటా ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. కనుక ఆ సమస్యకు పరిష్కారంగా  జియో మొత్తం 3 ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇక్కడ నెలవారీ ప్లాన్ అయితే.. రూ. 189తో 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలిగ్ 28 రోజుల పరిమితితో, ఇదే 84 రోజులకు అయితే 6GB డేటా, అపరిమిత కాలింగ్‌తో ప్లాన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. మరీ, BSNL  దెబ్బకు  జియో తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments