P Venkatesh
బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. అంతకంతకూ పెరుగుతూ గోల్డ్ కొనాలంటేనే ఆలోచించే పరిస్థితికి చేరుకుంది. ఇక రానున్న రోజుల్లో రూ. 80 వేలు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. అంతకంతకూ పెరుగుతూ గోల్డ్ కొనాలంటేనే ఆలోచించే పరిస్థితికి చేరుకుంది. ఇక రానున్న రోజుల్లో రూ. 80 వేలు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
P Venkatesh
పసిడికి మన దేశంలో ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏ శుభకార్యమైన బంగారం కొనాల్సిందే. చాలా మంది ఎక్కువగా బంగారమే కొంటుంటారు. బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే భవిష్యత్తులో గోల్డ్ ధరలు పెరగడమే తప్పా తగ్గడం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో అధిక లాభాలు వస్తాయని పసిడి ప్రియుల నమ్మకం. అంతేకాదు పసిడి తమ వద్ద ఉన్నట్లైతే ఆపద సమయంలో ఆదుకుంటుందని వారి నమ్మకం. ప్రస్తుతం రోజు రోజుకి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. పుత్తడి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,760 వద్ద ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,740 వద్ద అమ్ముడవుతోంది. దీంతో రానున్న రోజుల్లో బంగారం ధర రూ. 80 వేలు దాటే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, దేశాల మధ్య వార్ ఈ కారణాల చేత బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే తులం బంగారంపై దాదాపు 6 వేల వరకు పెరిగింది. రానున్న రోజుల్లో సామాన్యులకు బంగారం అందని ద్రాక్షలాగానే మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పసిడి ప్రియులు బంగారం ఇప్పుడు కొనుగోలు చేయాలా? వద్దా అనే సందిగ్థంలో పడిపోయారు. ఇంతకీ బంగారం ధరలు భారీగా పెరగడానికి గల కారణాలు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ ఈ విషయంలో ముందంజలో ఉండి బంగారాన్ని కొనుగోలు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం ధరలు ఈ ఏడాది చివరికి రూ. 80 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. 80 వేలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు మార్కెట్ నిపుణులు. మరోవైపు డాలర్ తో రూపాయి మారకం పడిపోవడం కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గోల్డ్ ధర ఎంత పెరిగినా కూడా డిమాండ్ మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. పసిడి ప్రియులకు బంగారమంటే ఎంత మోజో దీన్ని బట్టి చెప్పొచ్చు.