గోల్డ్ వర్సెస్ రియల్ ఎస్టేట్.. వీటిలో ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం?

Gold Or Real Estate, Which Is More Profitable: డబ్బులు ఉంటే పెట్టుబడి బంగారం మీద పెడితే ఎక్కువ లాభమా? లేక ప్రాపర్టీ మీద పెడితే ఎక్కువ లాభం వస్తుందా? గత ఐదేళ్లుగా చూసుకుంటే బంగారం ధరలు ఎలా ఉన్నాయి? రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాయి? ఏది ఎక్కువగా పెరిగింది? అనే లెక్కలు మీ కోసం.

Gold Or Real Estate, Which Is More Profitable: డబ్బులు ఉంటే పెట్టుబడి బంగారం మీద పెడితే ఎక్కువ లాభమా? లేక ప్రాపర్టీ మీద పెడితే ఎక్కువ లాభం వస్తుందా? గత ఐదేళ్లుగా చూసుకుంటే బంగారం ధరలు ఎలా ఉన్నాయి? రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాయి? ఏది ఎక్కువగా పెరిగింది? అనే లెక్కలు మీ కోసం.

బంగారం, రియల్ ఎస్టేట్ ఈ రెండూ పెట్టుబడికి ఉత్తమ మార్గాలుగా పరిగణిస్తారు. స్థోమతకు తగ్గట్టు బంగారం కొనగలిగే వాళ్ళు బంగారం, ప్రాపర్టీ కొనేవాళ్ళు ప్రాపర్టీ కొంటూ ఉంటారు. అయితే రెండూ కొనగలిగే స్థోమత ఉన్నవాళ్లు ఉంటారు. వారు ఏది కొంటే ఎక్కువ లాభం ఉంటుంది? బంగారం కొనడం వల్ల ఎక్కువ లాభమా? లేక భూమ్మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభమా? అని అంటే రెండూ విలువైన పెట్టుబడి ఆప్షన్లే అని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ లో ఎక్కువ లాభాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. 

రియల్ ఎస్టేట్ లో దీర్ఘకాలిక పెట్టుబడితో అత్యధిక లాభాలు వస్తాయి. ల్యాండ్ కొని అక్కడ ఏదైనా ఇల్లు లేదా కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తే రెంట్ అనేది వస్తుంటుంది. ల్యాండ్ మాత్రమే కొని వదిలేసిన కొన్నేళ్ళకు దాని విలువ అనేది పెరుగుతుంది. కనీసం 2 శాతం వడ్డీ అనేది వస్తుంది. ఉదాహరణకు కొంత భూమిని 10 లక్షలు పెట్టి కొంటే నెలకు 20 వేలు వడ్డీ అనుకున్నా గానీ ఏడాదికి 2 లక్షల 40 వేలు అవుతుంది. ఆ రేటు కంటే ఎక్కువ విలువ పలుకుతుంది భూమి. రియల్ ఎస్టేట్ పడిపోతే ల్యాండ్ విలువ పడిపోతుంది. కానీ మరీ ఘోరంగా అయితే పడిపోదని నిపుణులు చెబుతున్నారు. కాస్త తగ్గుతుంది కానీ మరీ దారుణంగా అయితే భూమి విలువ పడిపోదని చెబుతున్నారు. రిస్క్ ఉంటుంది కానీ ఎక్కువ రిస్క్ ఉండదని చెబుతున్నారు.

ఇక బంగారం విషయానికొస్తే బంగారం విలువ కూడా పెరుగుతూ వస్తుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2010లో 18 వేలు ఉంటే 2024లో 70 వేలు దాటింది. అయితే రియల్ ఎస్టేట్ తో పోలిస్తే బంగారం మీద పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ ఉంటుందని చెబుతున్నారు. బంగారం వల్ల ఆదాయం అనేది ఉండదు. భద్రపరచుకోవాలన్న టెన్షన్ ఉంటుంది. బ్యాంకులో లాకర్లలో దాచుకోవడానికి అదనంగా ఖర్చు. బంగారం ధరలు స్థిరంగా ఉండవు. హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒకరోజు ఎక్కువ ఉంటే ఇంకో రోజు తక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్ అలా కాదు.. ఏటా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో దశాబ్దానికి ఒకసారి ఆర్థిక మాంద్యం వస్తే తప్ప నష్టం ఉండదని చెబుతున్నారు. 

లెక్కలతో సహా ఏది లాభమో ఇక్కడ నిర్ణయించుకోండి:    

2019లో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 3500గా ఉండేది. ఇప్పుడు 7,069 అయ్యింది. ఇదే పెట్టుబడిని మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టి ఉంటే దాని విలువ ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? ఉదాహరణకు కూకట్ పల్లి ఏరియా తీసుకుందాం. 2019లో ఈ ఏరియాలో చదరపు అడుగు రూ. 5,300 ఉండేది. ఇప్పుడు రూ. 12,250 అయ్యింది. ఐదేళ్ళలో 131 శాతం పెరిగింది. మీరు 2019లో 35 వేలు పెట్టి 10 గ్రాముల బంగారం కొంటే ఐదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు దాని విలువ 70 వేలు అయ్యింది. అంటే 50 శాతం పెరిగింది. అదే 35 వేల పెట్టుబడిని కూకట్ పల్లిలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే 7 చదరపు అడుగుల స్థలం వచ్చేది. అంటే దగ్గర దగ్గర ఒక గజం స్థలం. దాని విలువ ఇప్పుడు 85 వేలు పైనే ఉంది. ఈ లెక్కన గోల్డ్ మీద కంటే రియల్ ఎస్టేట్ లోనే ఎక్కువ లాభం అనేది వస్తుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీర్ఘకాలిక పెట్టుబడితో రియల్ ఎస్టేట్ లో బంగారం కంటే కూడా ఎక్కువ లాభాలు పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో బంగారం, వెండి, ఇతర లోహాలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇన్వెస్ట్ మెంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటితో పోలిస్తే రియల్ ఎస్టేట్ లో భూమి మీద పెట్టిన పెట్టుబడే 500 రెట్లు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బంగారం వర్సెస్ రియల్ ఎస్టేట్ ఏది ఉత్తమ పెట్టుబడి అంటే.. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనే చెబుతున్నారు.

Show comments