బంగారు నగలు పోతే మీ డబ్బు వాపస్.. జ్యువెలరీ షాప్ వాళ్ళు ప్రజలకి చెప్పని రహస్యం!

Gold Jewellery: బంగారు నగలు పోతే మీ డబ్బు తిరిగి వాపస్‌ పొందవచ్చని మీకు తెలుసా.. తెలియదు కదా. మనకనే కాదు.. సమాజంలో చాలా మందికి ఈ విషయం తెలియదు. జ్యువెరీ షాపు వల్ల దీని గురించి ప్రజలకు చెప్పరు. ఆ వివరాలు..

Gold Jewellery: బంగారు నగలు పోతే మీ డబ్బు తిరిగి వాపస్‌ పొందవచ్చని మీకు తెలుసా.. తెలియదు కదా. మనకనే కాదు.. సమాజంలో చాలా మందికి ఈ విషయం తెలియదు. జ్యువెరీ షాపు వల్ల దీని గురించి ప్రజలకు చెప్పరు. ఆ వివరాలు..

బంగారం ధర చూస్తే సామాన్యులు భయపడిపోతున్నారు. రాకెట్‌ కన్నా వేగంగా గోల్డ్‌ రేటు దూసుకుపోతుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. రానున్న రోజుల్లో సామాన్యులు, మధ్యతరగతి వారు బంగారం కొనడం అనేది కలగా మారొచ్చు అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మన దగ్గర పసిడి ధరల్లో మార్పు ఉంటుంది. ఇక నేడు దేశీయంగా బంగారం ధర భారీగా పెరగ్గా.. వెండి రేటు అయితే ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. ఇక నేడు భాగ్యనగరంలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం కొనాలంటే.. 73 రూపాయల పైనే చెల్లించాలి. ఇక ఇప్పట్లో గోల్డ్‌ రేటు దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు అంటున్నారు.

గోల్డ్‌ రేటు దూసుకుపోతుండటంతో.. బంగారం దొంగతనాలు కూడా ఆస్థాయిలోనే చోటు చేసుకుంటున్నాయి. ఈమధ్య కాలంలో చైన్‌ స్నాచింగ్‌, బంగారు ఆభరణాల దొంగతనాల నేరాలు విపరీతంగా పెరగడం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి గోల్డ్‌ పోగొట్టుకుంటే.. ఇక మళ్లీ కొనడం ఇప్పట్లో సాధ్యం కాదు. పోయిన బంగారం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.. మన అదృష్టం బాగుంటే దొరకవచ్చు.. లేదంటే అటే పోవచ్చు. అయితే ఇక్కడే ఎవరికి తెలియని ఓ రహస్యం ఉంది. మీ బంగారం పోతే.. డబ్బులు వాపస్‌ పొందవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే జ్యువెలరీ షాపు యజమానులు దీని గురించి కస్టమర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వరు కాబట్టి. ఇంతకు బంగారం పోతే డబ్బులు ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బంగారు ఆభరణాలకు కూడా బీమా..

సాధారణంగా వాహనాలు, బిల్డింగ్‌లు, ఆఖరికి మొబైల్‌ ఫోన్లకు కూడా ఇన్సూరెన్స్‌ ఉంటుంది. ఇది అందరికి తెలిసిన సంగతే. కానీ బంగారు ఆభరణాలకు కూడా బీమా వర్తిస్తుందని మీకు తెలుసా. మీకనే కాదు సమాజంలో చాలా మందికి ఈ విషయం తెలియదు. పైగా జ్యువెలరీ షాపు యజమానులు కూడా దీని గురించి కస్టమర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వరు. ఏవో కొన్ని పేరు మోసిన కంపెనీలు తప్ప.. చాలా బంగారు ఆభరణాల కంపెనీలు దీని గురించి కస్టమర్లకు చెప్పవు. కానీ వాహనాలు, వస్తువుల మాదిరే.. బంగారు ఆభరణాలకు కూడా ఇన్సూరెన్స్‌ ఉంటుంది. పైగా వినియోగదారులు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే.. ఈ బీమా కవరేజీని పొందవచ్చు.

ఈ క్రమంలో చాలా వరకు జ్యువెలరీ షాపులు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఇది ఎంపిక చేసిన ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కవరేజీ కూడా ఏడాది వరకు ఉంటుంది. అంటే మీరు ఆభరణాలు కొన్న ఏడాదిలోపు అవి పోయినా, చోరీ జరిగినా.. మీరు తిరిగి మీ డబ్బులు పొందవచ్చు. అయితే కంపెనీని బట్టి.. ఈ ఇన్సూరెన్స్‌ కవరేజీలోకి వచ్చే ఉత్పత్తులు మారుతుంటాయి. కొన్ని కంపెనీలు కేవలం వ్రజాభరణాలకే ఈ బీమాను వర్తింప చేస్తే.. కొన్ని కంపెనీలు 10 వేల రూపాయల కన్నా ఎక్కువ ఉన్న నగలకు ఇలా ఇన్సూరెన్స్‌ చేస్తుంటాయి. అయితే జ్యువెలరీ షాపులు.. ఇలా బంగారు ఆభరణాల మీద బీమా చేయిస్తాయని చాలా మంది కస్టమర్లకు తెలియదు.

మీరు కూడా బీమా తీసుకోవచ్చు..

అందుకే ఇకపై మీరు నగలు కొనే ముందే.. వాటిపై ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తిస్తుందా లేదా అన్నది అడిగి తెలుసుకోవాలి. ఈ కవరేజ్‌లో అగ్ని ప్రమాదం, భూకంపం, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వల్ల కలిగే నష్టాలతో పాటు.. అల్లర్లు, చైన్‌ స్నాచింగ్‌, దోపిడి వంటివి సైతం ఉటాయి. అలానే రవాణా సమయంలో ఏదైనా దొంగతనం, దోపిడి జరిగినా.. బీమా వర్తిస్తుంది.

దురదృష్టశాత్తు.. మీరు నగలు కొన్న ఏడాది లోపు అవి దొంగతానికి గురైతే.. ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారి వద్ద నుంచి నాన్‌ ట్రేజబుల్‌ సర్టిఫికేట్‌ తీసుకుని.. ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అందించాలి. అప్పుడు మీ బంగారం విలువకు సమానమైన డబ్బులను మీకు తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ మీరు ఆభరణాలు కొన్న షాపులు ఈ బీమా సౌకర్యం లేకపోతే.. మీరే వ్యక్తిగతంగా మీ ఆభరణాల కోసం బీమా పాలసీ తీసుకోవచ్చు అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. కనుక ఈ సారి ఆభరణాలు కొనే ముందు ఈ సూచన పాటించండి.

Show comments