P Venkatesh
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి సమయం. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంతుందంటే?
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి సమయం. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంతుందంటే?
P Venkatesh
గోల్డ్ ధరలు పెరుగుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు ఇది ఊరటనిచ్చే అంశం. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం పడిపోవడం వంటి కారణాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. మరి నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి. తులం బంగారంపై ఎంత తగ్గింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ. 100 తగ్గగా.. రూ. రూ.58,050 వద్ద అమ్ముడవుతోంది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 110 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,330 కి చేరింది. అదే విధంగా విజయవాడ, విశాఖ పట్నం, బెంగళూరు వంటి నగరాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 58200 వద్ద అమ్ముడవుతోంది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63480 వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కొన్ని రోజులుగా గోల్డ్ తో పాటు పరుగులు తీసిన సిల్వర్ ధరలకు నేడు బ్రేకులు పడ్డాయి. ఈ రోజు కిలో వెండిపై రూ. 300 తగ్గింది. దీంతో నిన్న రూ. 78300 గా ఉన్న ధర నేడు తగ్గిన ధరలతో రూ. 78000 వద్ద వెండి అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖ పట్నం వంటి నగరాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.