iDreamPost
android-app
ios-app

GST బిల్స్‌తో రూ.10 వేల నుంచి రూ. కోటి వరకూ గెలుచుకునే ఛాన్స్!

  • Published Sep 11, 2023 | 6:06 PM Updated Updated Sep 11, 2023 | 6:06 PM
GST బిల్స్‌తో రూ.10 వేల నుంచి రూ. కోటి వరకూ గెలుచుకునే ఛాన్స్!

జీఎస్టీ అంటే గ్రాండ్ సర్వీస్ టాక్స్.. మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా, సూపర్ మార్ట్ లకి వెళ్ళినా బిల్ కట్టేటప్పుడు జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది. అయితే మీకు తెలుసా.. జీఎస్టీ బిల్ తో మీరు రివార్డ్ పాయింట్స్ పొందవచ్చునని. అది కూడా 10 వేల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ గెలుచుకోవచ్చు. అవును మీరు కొన్న వస్తువులకి సంబంధించి జీఎస్టీ బిల్స్ ఒక యాప్ లో అప్లోడ్ చేస్తే ప్రతి నెలా లక్కీ రివార్డ్స్ సంపాదించుకోవచ్చు. జీఎస్టీ పై అందరికీ అవగాహన కల్పించేందుకు.. అలానే జీఎస్టీ కట్టడంలో అందరినీ భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ‘మేరా బిల్ మేరా అధికార్’ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

మీరు అప్లోడ్ చేసే జీఎస్టీ ఇన్వాయిసెస్ ని బట్టి మీరు 10 వేలు, 10 లక్షలు, ఒక కోటి రూపాయల వరకూ నగదు బహుమతి గెలుచుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా.. ప్లే స్టోర్ లోకి వెళ్లి ‘మేరా బిల్ మేరా అధికార్’ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడమే. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేస్తే లాగిన్, సైనప్ ఆప్షన్స్ కనబడతాయి. మొదటిసారి యాప్ వాడుతున్నట్లైతే సైనప్ మీద క్లిక్ చేయండి. గవర్నమెంట్ ఐడీ ప్రకారం మీ పేరు, మీ మొబైల్ నంబర్, రాష్ట్రం నమోదు చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయగానే యాప్ లోకి లాగిన్ అవుతారు. యాప్ లో పైన.. మై ఇన్వాయిసెస్, హెల్ప్, స్టాటిస్టిక్స్ అని మూడు ఆప్షన్స్ ఉంటాయి. మై ఇన్వాయిసెస్ మీద క్లిక్ చేస్తే.. మీరు అప్లోడ్ చేసిన బిల్లులు కనబడతాయి. హెల్ప్ మీద క్లిక్ చేస్తే ట్యుటోరియల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ వంటివి ఉంటాయి.

స్టాటిస్టిక్స్ మీద క్లిక్ చేస్తే.. ఈరోజు వరకూ ఎన్ని ఇన్వాయిస్ లు అప్లోడ్ అయ్యాయి.. మీ ద్వారా ఇప్పటివరకూ ఎన్ని ఇన్వాయిస్ లు అప్లోడ్ అయ్యాయి.. ప్రస్తుత నెలలో ఎన్ని ఇన్వాయిస్ లు అప్లోడ్ అయ్యాయి అనే డేటా కనబడుతుంది. దాని కింద రాష్ట్రాల వారీగా అప్లోడ్ చేసిన ప్రస్తుత నెల ఇన్వాయిస్ లు అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఏ రాష్ట్రం నుంచి ఎన్ని ఇన్వాయిస్ లు అప్లోడ్ అయ్యాయి అనే డేటా కనబడుతుంది. నెలకు ఒక వ్యక్తి 25 ఇన్వాయిస్ లు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్ లో ఉన్న కెమెరాతో ఫోటో తీసి ఇన్వాయిస్ బిల్లు అప్లోడ్ చేయవచ్చు, లేదా ఇన్వాయిస్ ఫోటో అప్లోడ్ చేయవచ్చు, లేదా పీడీఎఫ్ ఫైల్ అప్లోడ్ చేయవచ్చు.

అయితే మీ ఇన్వాయిస్ బిల్లులో తేదీ, అమౌంట్ స్పష్టంగా కనబడాలి. అలానే బిల్లు కార్నర్స్ కనబడాలి. ఇలా నెలకు 25 ఇన్వాయిస్ లు అప్లోడ్ చేయవచ్చు. యాప్ కింద హోమ్, నోటిఫికేషన్స్, ప్రొఫైల్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే.. నోటిఫికేషన్స్, ఇన్బాక్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏమైనా రివార్డులు గెలుచుకుంటే ఇన్బాక్స్ లో మెసేజ్ వస్తుంది. మరింకెందుకు ఆలస్యం.. ఈరోజు నుంచే జీఎస్టీ బిల్స్ ని అప్లోడ్ చేస్తూ.. ప్రతి నెలా లక్కీ రివార్డ్స్ గెలుచుకునే అవకాశం పొందండి. ఈ వీడియోని మీ సర్కిల్ ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. అలానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రివార్డ్స్ స్కీంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.